కరోనాతో టీవీ ఛానల్‌ ఎండీ కన్నుమూత

Kalinga Darpan TV Channel MD Bishnu Prasad Sahu Died With Corona - Sakshi

 ‘కళింగ దర్పన్‌’ ఎండీ బిష్ణు ప్రసాద్‌ సాహు మృతి

బరంపురం: కరోనాతో కళింగ దర్పన్‌ టీవీ చానల్‌ ఎండీ బిష్ణు ప్రసాద్‌ సాహు (48) ఆదివారం కన్నుమూశారు. కొద్దిరోజుల కిందట వైరస్‌ బారినపడిన ఈయన చికిత్స నిమిత్తం టాటా కోవిడ్‌ కేర్‌ సెంటర్‌లో చేరారు. అక్కడే చికిత్స పొందుతుండగా ఉదయం మరణించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ప్రతిదిన్, ఒడిశా భాస్కర్‌ వంటి దినపత్రికల్లో రిపోర్టర్‌గా పనిచేసిన ఆయన సరిగ్గా మూడేళ్ల కిందట బరంపురం నగరంలో కళింగ దర్పన్‌ పేరిట టీవి చానల్‌ ప్రారంభించి, పేరు ప్రఖ్యాతలు పొందారు. ఆయన మృతి పట్ల గంజాం, బరంపురం ప్రాంతాల జర్నలిస్టులు తమ సంతాపం ప్రకటించారు.

చదవండి: ప్రభుత్వ టీచర్‌ కుటుంబాన్ని చిదిమేసిన కరోనా

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top