అజంఖాన్‌కు మధ్యంతర బెయిల్‌ తిరస్కృతి | SC Refuses Azam Khan Plea Seeking Interim Bail | Sakshi
Sakshi News home page

అజంఖాన్‌కు మధ్యంతర బెయిల్‌ తిరస్కృతి

Feb 9 2022 11:46 AM | Updated on Feb 9 2022 11:46 AM

SC Refuses Azam Khan Plea Seeking Interim Bail - Sakshi

ఏకంగా 32 బెయిల్‌ పిటిషన్లు వేస్తారా? రాజకీయాలకు కోర్టును తేవొద్దని సుప్రీకోర్టు కటువుగా వ్యాఖ్యానించింది.

న్యూఢిల్లీ: సమాజ్‌వాదీ పార్టీ మైనారిటీ నాయకుడు ఆజంఖాన్‌కు మధ్యంతర బెయిల్‌ ఇవ్వడానికి సుప్రీంకోర్టు మంగళవారం నిరాకరించింది. ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేయడానికి వీలుగా తనకు మధ్యంతర బెయిలు ఇప్పించాలని ఆజంఖాన్‌ పలు పిటిషన్‌లను దాఖలు చేయడంపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఏకంగా 32 బెయిల్‌ పిటిషన్లు వేస్తారా? రాజకీయాలకు కోర్టును తేవొద్దని కటువుగా వ్యాఖ్యానించింది. అయితే బెయిల్‌ను కోరుతూ సంబంధింత కోర్టులో పిటిషన్‌ వేసుకునే స్వేచ్ఛను ధర్మాసనం ఆజంఖాన్‌కు ఇచ్చింది. వేధింపుల్లో భాగంగా యోగి సర్కారు తనపై ఏకంగా 87 కేసులను బనాయించిందని... వీటిలో 84 కేసుల్లో బెయిల్‌ మంజూరైందని ఆజంఖాన్‌ తన న్యాయవాది కపిల్‌ సిబల్‌ ద్వారా కోర్టు దృస్టికి తెచ్చారు.    

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement