అది సరికాదు.. సాయిబాబా కేసును మరోసారి విచారించండి: సుప్రీం కోర్టు

SC Matter Back To Bombay High Court G N Saibaba In Maoist Links Case - Sakshi

ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రోఫెసర్‌ జీఎన్‌ సాయిబాబాకు సుప్రీంకోర్టులో భారీ షాక్‌ తగిలింది. మావోయిస్టులతో సంబంధాలున్న కేసులో సాయిబాబాను నిర్ధోషిగా విడుదల చేస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును దేశ అత్యున్నత న్యాయస్థానం పక్కన పెట్టింది. ఈ కేసులో మరోసారి విచారణ జరపాలని బాంబే హైకోర్టును బుధవారం ఆదేశించింది. ఈ మేరకు నాలుగు నెలల్లో విచారణ పూర్తి చేయాలని ఎమ్‌ ఆర్‌ షా, సీటీ రవికుమార్‌తో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీచేసింది.

గతంలో నిర్దోషిగా ప్రకటించిన హైకోర్టు ఇప్పటికే ఒక అభిప్రాయాన్ని ఏర్పరుచుకున్నందున సముచిత ప్రయోజనాల దృష్ట్యా మరో బెంచ్‌ అన్ని కోణాల్లో ఒకే విధంగా విచారణ జరపాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ మేరకు దాఖలైన అప్పీల్‌ను విచారించిన సుప్రీం కోర్టు ఈ విధంగా తీర్పు ఇచ్చింది. 

గతేడాది  అక్టోబర్‌ 15న చట్ట వ్యతిరే కార్యకలాపాల చట్టం(యూఏపీఏ) కింద.. సాయిబాబా ఇతరులపై ప్రాసిక్యూషన్‌ చెల్లుబాటు కాదని కొట్టేసిన బాంబే హైకోర్టు.. వాళ్లను తక్షణమే విడుదల చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది.  అయితే ఇప్పుడు ఎన్‌ఐఏ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు స్పందిస్తూ.. ట్రయల్‌ కోర్టుల తీర్పు ప్రకారం దోషులుగా నిర్థారించిన వారి నేరాల తీవ్రతను బాంబే హైకోర్టు పరిగణలోనికి తీసుకోలేదని అభిప్రాయపడింది.

దేశ సార్వభౌమాధికారం, సమగ్రతకు వ్యతిరేకంగా హైకోర్టు అభ్యంతరకరమైన తీర్పు ఇచ్చిందని, దీనిపై సమగ్ర పరిశీలన అవసరమని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.

కాగా, ఈ కేసుకి సంబంధించిన యూఏపీఏ కింద గడ్చిరోలి కోర్టులోని విచారణ ప్రకియను చెల్లదని పేర్కొంటూ బాంబే హైకోర్టు నాగ్‌పూర్‌ బెంచ్‌ అక్టోబర్‌ 14న ఈ కేసులో జీవిత ఖైదు పడిన సాయిబాబాను విడుదల చేసింది. అలాగే ఈ కేసుకి సంబంంధించిన మరో నలుగురిని నిర్దోషులుగా ప్రకటించింది, అయితే ఆరో నిందితుడు 2022లో చనిపోయాడు.

(చదవండి: బీజేపీ యువనేత దారుణ హత్య.. వాళ్ల పనే అని కమలం పార్టీ ఎంపీ ఫైర్..)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top