13వ షెడ్యూల్‌పై ముగిసిన సమీక్షా సమావేశం

Review Meeting On The 13th Schedule Of AP Bifurcation Act - Sakshi

ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన చట్టంలోని 13వ షెడ్యూల్‌లో పేర్కొన్న అంశాల అమలుకు సంబంధించి ఈరోజు(మంగళవారం)ఢిల్లీ వేదికగా జరిగిన సమీక్షా సమావేశం ముగిసింది. దాదాపు రెండు గంటల పాటు కొనసాగిన సమావేశంలో 13వ షెడ్యూల్‌లోని విద్యా సంస్తలు, మౌలిక వసతుల ప్రాజెక్టుల పురోగతిపై చర్చించారు.

ఈ సమావేశంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ బల్లా నేతృత్వంలో జరిగింది.  ఈ సమావేశానికి ఏపీ ప్రభుత్వ సీఎస్‌ జవహర్‌రెడ్డి, ఉన్నతాధికారులు శ్రీలక్ష్మి, ప్రేమ చంద్రరెడ్డి, ప్రేమ చంద్రరెడ్డి, ఎస్‌ఎస్‌ రావత్‌, యువరాజ్‌లు హాజరయ్యారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top