Pankaj Mahajan:‘ఆ రోజు చేసిన పని నన్ను పదే పదే కలచివేసింది'

Rescued By Football Ex-Alcohol Addict Gives Back to Society - Sakshi

ఇటీవలకాలంలో యువత ఎక్కువగా  సిగరెట్స్‌, మద్యం, డ్రగ్స్‌ వంటి వాటికి బానిసై తమ జీవితాలను ఏవిధంగా నాశనం చేసుకుంటున్నారో చూశాం. ఆఖరికి సినితారలను సైతం ఈ జాడ్యం వదలడం లేదు. ప్రముఖ సెలబ్రెటి పిల్లలతో సహా అందరూ వీటికి బానిసై పోతున్నారు. ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టిన ప్రజల్లోనూ, యువతలోను మార్పు రాకపోవడం మన దురదృష్టమో లేక మరోకటో తెలియదు. అయితే ఇక్కడొక మహారాష్ట్రవాసి చిన్నవయసులో సిగరెట్‌ కాల్చడం, మద్యం సేవించడం వంటి వాటికి బానిసయ్యాడు. అయితే అతను అలా వాటికి అడిక్టి అవ్వడమే తనకు వరంగా మారిందనే చెప్పలి. ఒక రకంగా తన జీవితాన్ని అర్థవంతంగా మార్చింది. 

అసలు విషయంలోకెళ్లితే...మహారాష్ట్రలోని గోధాని గ్రామ నివాసి అయిన పంకజ్‌ మహాజన్‌ నాల్గవ తరగతి చదువుతున్నప్పటి నుంచి పొగాకు, మద్యపానానికి బానిసయ్యాడు. దీనికితోడు మద్యానికి బానిసైన తండ్రి, వికలాంగురాలైన తల్లి ఉండటంతో పంకజ్‌కి సరైన మార్గదర్శకత్వం లేకుండా పోయింది. అయితే పంకజ్‌ తండ్రి పోగాకుతో సహా నిత్యావసరాల వస్తువులు విక్రయించే దుకాణాన్ని నడిపేవాడు. ఈమేరకు పంకజ్‌ తన తండ్రి, ఆ గ్రామ పెద్దలు స్టైయిలిష్‌గా పొగాకు తాగటం చూసి తాను కూడ వారి అడుగుజాడల్లోనే నడవాలని అనుకున్నాడు. అంతేకాదు ఎవరికి తెలియకుండా పొగాకు కాల్చడం కూడా నేర్చుకున్నాడు.

అమ్మను కాపాడుకోలేని స్థితి....
అయితే అది ఎంతవరకు వచ్చిందంటే ఒక్కరోజులోనే పొగాకు ప్యాకెట్‌ మొత్తం అయిపోయిలా తాగేంతవరకు వచ్చింది. అంతేకాదు పంకజ్‌ సిగరెట్‌ కాలుస్తున్నప్పటికీ తండ్రి మందలించకపోవడంతో పంకజ్‌కి అది తప్పు అన్న విషయం తెలియలేదు. ఆ తర్వాత పంకజ్‌ మద్యం సేవించటం కూడా మొదలు పెట్టేశాడు. దీంతో ఆ బస్తీలో ఉన్న మిగతా పిల్లల తల్లిదండ్రులు పంకజ్‌ దగ్గరకు వెళ్లనిచ్చేవారు కాదు. మరోవైపు తన తండ్రి మద్యానికి బానిసై డబ్బులు కోసం తన తల్లిని, తనను కొడతుండటంతో పదిలోనే చదువుకు స్వస్తి పలికి డబ్బులు సంపాదించటం మొదలు పెట్టాడు. అయితే ఒకరోజు తన తండ్రి తాగి వచ్చి తన తల్లిని చితకొట్టాడు. ఈ క్రమంలో ఆమె తలకు పెద్ద గాయం అవుతుంది. అయితే అక్కడే ఉన్న పంకజ్‌ తన తండ్రిని ఆపడానికి గాని తన తల్లిన కాపాడుకోవటానికి గాని ప్రయత్నించకుండా అలా చూస్తుండిపోతాడు.

జీవితాన్ని మలుపు తిప్పిన ఘటన....
చుట్టుపక్కల వాళ్లు వాళ్ల అమ్మను ఆసుపత్రిలో జాయిన్‌ చేసి కాపాడతారు. ఆ సంఘటనే తన జీవితాన్ని మారుస్తుంది. పంకజ్‌ ఈ చెడ్డఅలవాట్లకు బానిసయ్యి నీరసించపోవటం, అలిసిపోయి ఏ పని చేయలేని స్థితికి చేరుకుంటాడు. అందువల్లే ఆ రోజు అతను తన తండ్రి దాడి చేస్తున్నప్పుడు తల్లిని కాపాడే శక్తి కూడా లేక నిస్సత్తువగా చూస్తుండిపోయాడు. ఆ సంఘటనే తన జీవితాన్ని ఒక మలుపు తిప్పింది. అనుకోకుండా పంకజ్‌ గ్రామానికి ఎన్‌జీవోలు వచ్చారు. అయితే ఆ గ్రామస్తులు కారణంగా పంకజ్‌ గురించి ఎన్‌జీవోలకు తెలుస్తుంది. ఈ మేరకు వారు స్వచ్ఛందంగా పంకజ్‌ విషయంలో జోక్యం చేసుకుని విజయ్ బార్సే ప్రారంభించిన ఆశ్రమంలో జాయిన్‌ చేశారు. అది ఎన్‌జీవోల ద్వారా జాయిన్‌ అయిన నిరాశ్రయులైన పిల్లలకు ఉచితంగా ఫుట్‌బాల్ శిక్షణ ఇచ్చే సెంటర్‌. ఈ మేరకు ఉచిత ఫుట్‌బాల్‌ శిక్షణ మాత్రమే కాక స్టైఫండ్‌ ఇచ్చి స్కూలుకి కూడా పంపిస్తారు. అయితే ఒక్కొక్కసారి తన చెడ్డ అలవాట్ల వైపు వెళ్లాలనిపించినా అతను వెళ్లలేదు.

ఆ సంఘటనే కళ్ల ముందు మెదలడంతో...
ఆ రోజు తన తల్లి నెత్తురోడుతుంటే అంబులెన్స్‌కి కూడా కాల్‌ చేయలేని నిస్సహాయ స్థితి అతనికి గుర్తుకు వచ్చేదని పంకజ్‌ ఇతరులకు పదే పదే చెబుతూ ఉండేవాడు. అంతేకాదు పంకజ్‌ ఎంతో కసిగా ఫుట్‌ బాల్‌ ఆడటం కూడా నేర్చకునేవాడు. పైగా ఒక్కరోజు కూడా ప్రాక్టీస్‌ చేయడం మానేవాడు కాదు. ఆ నిర్విరామ కృషే  అతన్ని రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఫుట్‌బాల్‌ని ఆడేలా చేసింది. ఆ తర్వాత అతను 2013లో హోమ్‌లెస్ వరల్డ్ కప్ కోసం తన మొదటి అంతర్జాతీయ మ్యాచ్ ఆడేందుకు పోలాండ్‌కు వెళ్లాడు. అప్పుడే అతని గురించి పత్రికల్లోనూ, మీడియాల్లోనూ బాగా వచ్చింది. అంతేకాదు ఏ గ్రామస్థులైతే అసహ్యంగా చూశారో వారే నన్ను ఇప్పుడూ మెచ్చకుంటున్నారని చెప్పాడు. అయితే తనలాంటి పిల్లలకు సాయం చేయడం కోసం ఎన్‌జీవోలో పేరు నమోదు చేసుకున్నానని, పైగా తాను ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేశానని చెప్పాడు. ఇతని కథ నిజంగా స్ఫూర్తిధాయకం కదా!

(చదవండి: బాప్‌రే! 14 అంతస్థుల భవనంలో అగ్ని ప్రమాదం... ఐతే ఆ ఇద్దరు...!! షాకింగ్‌ వీడియో)
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top