బాప్‌రే! 14 అంతస్థుల భవనంలో అగ్ని ప్రమాదం... ఐతే ఆ ఇద్దరు...!! షాకింగ్‌ వీడియో

Viral Video: Teenage Siblings Escape Burning Apartment  - Sakshi

Teenage siblings escaped their burning apartment: మనం ఎన్నో భయంకరమైన ప్రమాదాలు చూసి ఉంటాం. కొన్ని ప్రమాదాలను మాత్రం తప్పించుకోవడం అసాధ్యంగా ఉంటుంది. పైగా ఆసమయంలో మనకు సాయం చేసేవారుకూడా లేకపోతే ఆ పరిస్థితి మరింత ఘోరం. అచ్చం అలానే ఇక్కడ ఇద్దరు అక్క తమ్ముడు అలాంటి స్థితిలోనే ఉంటారు. అంతేకాదు వాళ్లు ఆ గండం నుంచి చాలా చాకచక్యంగా బయటపడతారు.

(చదవండి: బంగారు గనుల తవ్వకాల్లో బయటపడ్డ వెయ్యికాళ్ల ప్రాణి!)

అసలు విషయంలోకెళ్లితే...న్యూయార్క్ నగరంలోని ఈస్ట్ విలేజ్‌లో 14-అంతస్తుల జాకబ్ రియిస్ 14- భవనంలోని నాల్గవ అంతస్తులో ఒక్కసారిగా మంట్లో వ్యాపించాయి. అంతేకాదు భయంకరంగా అగ్నికిలలు ఎగిసి పడుతుంటాయి. అయితే ఆభవనంలో ఉన్న ఇద్దరు అక్క తమ్ముళ్లు ఆ భవనం కిటికి గుండా బయటికి రావడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే ఈ క్రమంలో వారు ఆభవనానికి ఆనుకుని ఉన్న  పైపు సాయంతో నెమ్మదిగా కిందకి వచ్చేశారు

అయితే వారి అమ్మ మాత్రం మంటల్లో చిక్కుకుంటారు. ఆవిడకి త్రీవ గాయలవుతాయి. ఈ మేరకు ఆ సమయంలో ఆమె ఒక గదిలో ఉండిపోతుంది. అయితే వారిద్దరూ వాళ్ల అమ్మను తలుపు తీయమని గట్టిగా పిలిచినప్పటికీ ఆవిడ తీయలేకపోతారు. పైగా ఈ ప్రమాదంలో ఒక వృద్ధుడు మృతి చెందాడు. అంతేకాదు ఎలక్ట్రిక్‌ భవనాల కారణంగా అగ్నికిలలు వ్యాపించి ఉంటాయని భావించారు. ఈ మేరకు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అయితే వారు వచ్చే లోపు ఈ ఇద్దరూ అక్కతమ్ముడు ఏదోరకంగా ఆ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడటం విశేషం. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. మీరు కూడా ఓ లుక్‌ వేయండి.

(చదవండి: విలేకరుల సమావేశం జరపవద్దు!... అంటూ సాలీడు ఎలా అడ్డుపడుతుందో చూడండి!!)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top