
గుజరాత్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ఇప్పటి వరకు ఒక్క పెద్ద ఉగ్రవాద దాడి కూడా జరగలేదని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఆయన గుజరాత్‌లోని నర్మాద జిల్లాలో ఏర్పాటు చేసిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ.. 2014లో ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో బీజేపీ అధికారంలోకి వచ్చిందన్నారు. అప్పటి నుంచి దేశంలో ఒక్క పెద్ద ఉగ్రవాద దాడి కూడా జరగలేదని అన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి ఉగ్రవాదులు భయపడుతున్నారని పేర్కొన్నారు. అది బీజేపీ సాధించిన గొప్ప విజయమని తెలిపారు.
చదవండి: West Bengal Post Poll Violance: సీబీఐ ఛార్జ్‌షీట్‌లో ఇద్దరు నిందితుల పేర్లు
ఉగ్రవాదులు తమకు బలమైన స్థావరాలు అనుకుంటున్న ప్రాంతాలు కూడా సురక్షితమైనవి కాదని భావిస్తున్నట్లు అభిప్రాయపడ్డారు. పీఓకేలో సర్జికల్ స్ట్రైక్ ద్వారా భారత్‌దేశ శక్తిని ప్రపంచానికి తెలియజేశామని పేర్కొన్నారు. భారత సైన్యం పట్ల ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి కనీసం ప్రశంసించే ఆలోచన కూడా లేదని మండిపడ్డారు. అదీకాక 40 ఏళ్లుగా వన్ ర్యాంక్-వన్ పెన్షన్ సమస్యను పరిష్కరించకుండా ఉంచారని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ దుయ్యబట్టారు.