రాజస్థాన్‌: ఆస్పత్రి ఐసీయూలో ఘోర అగ్నిప్రమాదం | Rajasthan Jaipur SMS Hospital Incident Full Details Updates | Sakshi
Sakshi News home page

రాజస్థాన్‌: ఆస్పత్రిలో ఘోర అగ్నిప్రమాదం.. ఐసీయూలో ఆరుగురి దుర్మరణం

Oct 6 2025 6:57 AM | Updated on Oct 6 2025 7:13 AM

Rajasthan Jaipur SMS Hospital Incident Full Details Updates

జైపూర్‌: రాజస్థాన్‌లో ఘోరం చోటు చేసుకుంది. జైపూర్‌లోని ఓ ఆస్పత్రి ఐసీయూలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది(Rajasthan Fire Accident). ఈ ఘటనలో ఇప్పటిదాకా ఆరుగురు మృతి చెందగా, పలువురికి గాయాలైనట్లు సమాచారం. పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో.. మృతుల సంఖ్య పెరగవచ్చని తెలుస్తోంది. 

ఆదివారం అర్ధరాత్రి జైపూర్‌లోని సవాయ​ మాన్‌సింగ్‌(SMS Hospital Mishap) ఆస్పత్రిలో ఈ ఘోరం చోటు చేసుకుంది. రెండో అంతస్తులోని ఐసీయూలో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా అగ్ని చెలరేగి.. ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ప్రమాదంలో ఐసీయూలో ఉన్న వైర్లు, ఫైల్స్‌ కాలిపోయి మంటలు మరింత వేగంగా వ్యాపించాయి. ఆపై విషపు వాయివులు వెలువడడంతో పేషెంట్లు ఉక్కిరి బిక్కిరి అయ్యారు. ఈ ఘటనలో అక్కడిక్కడే ఆరుగురు చనిపోయారు.  మరో ఐదుగురికి సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన మరికొందరికి చికిత్స అందుతోంది.

ఘటన సమయంలో ఐసీయూ, సెమీ ఐసీయూలో కలిపి 24 మంది పేషెంట్లు ఉన్నట్లు ఆస్పత్రి నిర్వాహకులు తెలిపారు. ప్రమాదంతో దట్టమైన పొగ అలుముకోగా.. ఆస్పత్రిలో తీవ్ర గందరగోళం నెలకొంది. ప్రాణ భయంతో అంతా బయటకు పరుగులు తీశారు. రంగంలోకి దిగిన ఫైర్‌ సిబ్బంది రెండు గంటలపాటు శ్రమించి మంటల్ని అదుపు చేసినట్లు సమాచారం. 

సిబ్బందిపై ఆరోపణలు
అయితే ఘటన సమయంలో ఆస్పత్రి సిబ్బంది పేషెంట్లతో సంబంధం లేదన్నట్లు తమ ప్రాణాల కోసం పరుగులు తీశారని బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. ఘటన సమయంలో ఐసీయూ నుంచి దట్టమైన పొగ ఆస్పత్రి మొత్తం వ్యాపించిందని.. దీంతో తాము కంగారు పడ్డామని, ఆ సమయంలో మమ్మల్ని అప్రమత్తం చేయకుండా సిబ్బందే ముందుగా బయటకు పారిపోయారని వాళ్లు అంటున్నారు. ఈ క్రమంలో ఆందోళనకు దిగగా.. పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. 

అయితే ఆ ఆరోపణలను నిర్వాహకులు కొట్టిపారేశారు. తమ సిబ్బంది పేషెంట్లను బయటకు తీసుకొచ్చారని.. సీసీటీవీ ఫుటేజీలే అందుకు సాక్ష్యాలని అంటున్నారు. విష వాయువుల పొగ కారణంగా పేషెంట్లు అపస్మారక స్థితికి చేరుకున్నారని, సీపీఆర్‌తో రక్షించే ప్రయత్నం చేసినా లాభం లేకపోయిందని వైద్యులు తెలిపారు. మృతుల్లో నలుగురు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నట్లు ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement