రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. ఈ మేరకు ఓటర్లను ఆకర్షించేలా మేనిఫెస్ట్‌పై గట్టిగా ఫోకస్ పెట్టింది. ఈ సారి మేనిఫెస్టోలో కుల గణనతో సహ కీలక హామీలను ఇవ్వనున్నట్లు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తెలిపారు. మంగళవారం అందుకు సంబధించిన పార్టీ మేనిఫెస్టోని విడుదల చేశారు ఖర్గే. కాంగ్రెస్ కంచుకోట అయిన రాజస్తాన్‌లో మళ్లీ తమ పార్టీ ఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమగా చెప్పారు.
అలాగే తాము ఎన్నికల్లో ఇచ్చే ప్రతీ హామీని నెరవేర్చడమే గాక, తాము ఇవ్వగలిగే వాగ్దానాలనే పొందుపరిచామని చెప్పారు. ముఖ్యంగా మహిళలు, అణగారిన వర్గాల సంక్షేమ పథకాలపైనే దృష్టి పెట్టింది. తాము మళ్లీ అధికారంలోకి వస్తే కచ్చితంగా కుల గణన చేస్తామనే కీలక హామీతో ముందుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాగా, ఈ నెల 25న రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.
మేనిఫెస్టోలో కీలక హామీలు
- స్వామినాథన్ కమిషన్ నివేదిక ప్రకారం.. రైతులకు రూ. 2 లక్షల వరకు వడ్డీ లేని రుణం
- కొత్త పథకం కింద పంచాయతీ స్థాయిలో నియామకాలు , కులగణన హామీ
- ఇచ్చిన ఏడు గ్యారంటీ హామీలను నెరవేర్చడం తోపాటు పాత పెన్షన్ స్కీమ్ కింది కుటుంబంలో మహిళా పెద్దకు ఏడాదికి రూ. 10 వేలు, రూ. 500లకే ఎల్‌పీజీ సిలిండర్ తదితర హామీలు.
- ఏడాదికి రూ. 15 లక్షల కోట్లుగా ఉన్న రాజస్తాన్ ఎకనామీని 2030 కల్లా రూ 30 లక్షల కోట్లుకు చేరుకునేలా చేయడమే లక్ష్యం అని రాజస్తాన్ సీఎం గహ్లోత్ విడుదల చేసిన మేనిఫెస్టోలో తెలిపారు.
- చిరంజీవి వైద్య భీమా పథకం కవరేజ్‌ని రూ. 25 లక్షల నుంచి రూ. 50 లక్షల వరకు పెంచారు.
Congress winning Rajasthan 🔥
— Ashish Singh (@AshishSinghKiJi) November 21, 2023
Manifesto,pic.twitter.com/HshYKEDjyM
(చదవండి: రాజస్థానీలకు కాంగ్రెస్ ఏడు గ్యారంటీలు)


