రాజీవ్‌ గాంధీ జయంతి; రాహుల్‌ భావోద్వేగం..

Rahul Gandhi Tweet Over Father Rajiv Gandhi Birth Anniversary - Sakshi

నేడు మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ 76వ  జయంతి . ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీతో పాటు పలువురు నేతలు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. తండ్రి జయంతిని పురస్కరించుకొని ఆయన తనయుడు రాహుల్‌ గాంధీ నివాళులు అర్పించారు. ఈ మేరకు ట్వీట్‌ చేశారు. రాజీవ్‌ గాంధీకి భవిష్యత్తు మీద ఉన్న విజన్‌ చాలా గొప్పది. అంతకంటే ఆయన ఓ గొప్ప మనసున్న వ్యక్తి.. రాజీవ్ గాంధీ లాంటి వ్యక్తి నా తండ్రి అయినందుకు, అలాంటి వ్యక్తికి కుమారుడిగా పుట్టినందుకు చాలా గర్వపడుతున్నాను. నేను చాలా లక్కీ. ఈరోజు, ప్రతిరోజు మిమ్మల్ని మిస్సవుతున్నాం. అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. (ఇంకెంత కాలం జాప్యం..!)

అలాగే రాజీవ్‌ గాంధీ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నివాళులు అర్పించారు. ఇక 1944 ఆగష్టు 20న ముంబైలో జన్మించిన రాజీవ్‌ గాంధీ 1984లో 6వ దేశ ప్రధానిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు... అతి చిన్న వయసులోనే(40) ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన వ్యక్తిగా ఆయన రికార్డు సృష్టించారు. 1989 డిసెంబర్ 2 వరకు ప్రధానిగా రాజీ‌వ్‌ గాంధీ పని చేశారు. ఆ తర్వాత మే 1991లో తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో  లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం (ఎల్‌టీటీఈ) జరిపిన  ఎన్నికల ర్యాలీలో జరిగిన ఆత్మాహుతి దాడిలో రాజీవ్‌ గాంధీ మృతి చెందారు. కాంగ్రెస్ పార్టీ ఈ రోజును 'సద్భావన దివాస్' గా జరుపుతున్న విషయం తెలిసిందే. (గాంధీ కుటుంబానికి అధ్యక్ష పదవి వద్దు)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top