ఫ్రూఫ్‌ అవసరం లేదు! దిగ్విజయ్‌ సింగ్‌ వ్యాఖ్యలపై రాహుల్‌ వివరణ

Rahul Gandhi Rejects Digvijaya Singhs Remark Do Not Need Proofs - Sakshi

కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు దిగ్విజయ్‌ సింగ్‌ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఆ పార్టీ నాయకుడు రాహుల్‌ గాంధీ స్పందించారు. అవి ఆయన వ్యక్తిగత అభిప్రాయాలని, వాటితో కాంగ్రెస్‌ పార్టీ విభేదిస్తుందని తేల్చి చెప్పారు. తాము దిగ్విజయ్ సింగ్‌ అభిప్రాయాల కంటే పార్టీ అభిప్రాయాలకే ప్రాధాన్యత ఇస్తామని కరాఖండీగా చెప్పారు. తాను ఈ విషయంలో చాలా క్లారిటీగా ఉన్నానని చెప్పారు. అయినా సాయుధ దళాలు ఒక పనిని చాల అనుహ్యంగా చేయగలవు, వారి సామర్థ్యం గురించి కూడా తనకు తెలుసనని అన్నారు.

దీనికి ఆర్మీ ఎలాంటి ఆధారాలు చూపించాల్సిన అవసరం లేదంటూ దిగ్విజయ్‌ సింగ్‌ వ్యాఖ్యలను తోసిపుచ్చారు. ఆయన చేసిన వ్యాఖ్యలు కారణంగా పెద్ద ఎత్తున​ కాంగ్రెస్‌పై విమర్శలు రావడంతో రాహుల్‌ ఈ విధంగా వివరణ ఇచ్చారు. ఇదిలా ఉండగా, దిగ్విజయ్‌ సింగ్‌ మాటిమాటికి సర్జికల్‌ స్ట్రైక్‌ జరిగింది ఇంతమందిని చంపాం అంటూ కేంద్రం కబుర్లు చెబుతోందే గానీ వాటికి ఆధారాలు చూపించలేకపోయిందంటూ విమర్శలు ఎక్కుపెట్టారు. దీంతో బీజేపీ పెద్ద ఎత్తున​ కాంగ్రెస్‌పై విరుచుకుపడింది. రాహుల్‌ సూచన మేరకే దిగ్విజయ్‌ సింగ్‌ అలా విషపూరిత వ్యాఖ్యలు చేశారంటూ ఆరోపణలు చేసింది.

ఆర్మీపై గట్టి విశ్వాసం ఉండాలని, అది రాజకీయాలకు అతీతమైనదంటూ తిట్టిపోసింది బీజేపి. అయినా పదేపదే సర్జికల్‌ స్ట్రైక్‌ గరించి పూఫ్‌ అడుగుతున్నారు, అసలు ఆర్మీపై మీకు నమ్మకమే లేదనేది స్పష్టమవుతోందని బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్‌ భాటియా అన్నారు. అయినా కాంగ్రెస్‌కి ఇలా భాద్యతరహితమైన ప్రకటనలు ఇవ్వడం పరిపాటిగా మారిందంటూ మండిపడ్డారు. భారత సైన్యానికి వ్యతిరేకంగా మాట్లాడితే సహించేదే లేదని గట్టి వార్నింగ్‌ ఇచ్చారు. రాహుల్‌, దిగ్విజయ్‌లకు నరేంద్ర మోదీ పట్ల ఉన్న ద్వేషం కళ్లకు కట్టినట్లు అర్థమవుతోందని బాటియా దుయ్యబట్టారు. 

(చదవండి: వాటికి ప్రూఫ్‌ ఏంటి?: దిగ్విజయ్‌ సింగ్‌​ షాకింగ్‌ వ్యాఖ్యలు)​​​​​​

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top