వాటికి ప్రూఫ్‌ ఏంటి?: దిగ్విజయ్‌ సింగ్‌​ షాకింగ్‌ వ్యాఖ్యలు

Digvijaya Singh Questioned Surgical Strikes After Pulwama Terror Attack - Sakshi

కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు దిగ్విజయ్‌ సింగ్‌ పుల్వామా ఉగ్రదాడి, సర్జిక్‌ స్ట్రైక్‌లపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2019లో పుల్వామ ఉగ్రదాడిలో సుమారు 40 మంది భ్రదతా సిబ్బంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ విషయమై కేంద్రాన్ని గట్టిగా నిలదీశారు. "పుల్వామ ఉగ్రవాదానికి కేంద్రం, పైగా అక్కడ ప్రతి కారుని కూడా తనిఖీ చేస్తారు. అలాంటప్పుడూ రాంగ్‌సైడ్‌ నుంచి వచ్చిన స్కార్పియో కారుని ఎందుకు తనిఖీ చేయలేదు.

అప్పుడే కదా ఈ స్కారిపియో కారు భద్రతా సిబ్బంది కాన్వాయ్‌ని ఢీ కొనడంతో అంతమంది జవాన్లు చనిపోయారు" అంటూ కేంద్రంపై విరుచకుపడ్డారు. ఈ విషయమై ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి సరైనా సమాధానం ఇవ్వలేదన్నారు. అదీగాక పార్లమెంటులో బహిరంగంగా ప్రధాని మోదీ పదేపదే సర్జికల్‌ స్ట్రైక్‌  గురించి మాట్లాడతారంటూ విమర్శించారు. ఈ సర్జికల్‌  స్ట్రైక్‌తో ఇంతమందిని చంపాం అని ఏవో ప్రగాల్పాలు చెబుతుంటారని మండిపడ్డారు.

వాటికి సంబంధించి ఇప్పటి వరకు సరైనా ఆధారాలను అందించలేకపోయిందంటూ కేంద్ర ‍ప్రభుత్వంపై పెద్ద  ఎత్తున ఆరోపణలు చేశారు. ఈ మేరకు దిగ్విజయ్‌ సింగ్‌ జమ్మూలోని భారత్‌ జోడోయాత్రలో రాహుల్‌తో కలసి ఈ విషయాలు గురించి మాట్లాడారు. అంతేగాదు 300 కిలోల ఆర్‌డిఎక్స్‌ ఉగ్రవాదుల చేతికి ఎలా వచ్చిందని ప్రశ్నించారు. అలాగే ప్రధాని మోదీ, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మధ్య ఉన్న స్నేహ సంబంధాలపై కూడా పలు ప్రశ్నలను లేవనెత్తారు. అందుకు సంబంధించిన వీడియోని కూడా దిగ్విజయ్‌ సింగ్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు.

ఇదిలా ఉండగా, వాస్తవానికి జమ్మూ కాశ్మీర్‌లోని ఉరీలోని ఆర్మీ బేస్ క్యాంపుపై జరిగిన ఉగ్రదాడిలో సుమారు18 మంది సైనికులు మరణించారు. దీంతో 2016లో భారత్ సర్జికల్ స్ట్రైక్స్ ప్రారంభించింది.అయితే కాంగ్రెస్‌ పార్టీ పుల్వామా దాడి, వైమానిక దాడుల గురించి బీజేపీ కొంతకాలం వరకు ప్రశ్నలు సంధించింది. ఐతే బీజేపీ మన సైన్యాన్నే అనుమానిస్తున్నారా? అని గట్టి కౌంటర్‌ ఇవ్వడంతో సైలెంట్‌ అయ్యింది. 

(చదవండి: వీడియో: అలాంటి వ్యక్తి దొరికితేనే పెళ్లి: మరోసారి స్పష్టం చేసిన రాహుల్‌ గాంధీ)

మరిన్ని వార్తలు :

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top