‘జోడో’ను మూడు రోజులకే ముగిద్దామనుకున్నారు!

Rahul Gandhi Nearly Quit Bharat Jodo Yatra Over Knee Pain - Sakshi

తిరువనంతపురం: కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ తీవ్రమైన మోకాలి నొప్పి కారణంగా భారత్‌ జోడో యాత్రను మూడు రోజులకే ఆపేయాలనుకున్నారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ చెప్పారు. రాహుల్‌కు అత్యంత విశ్వసనీయుడిగా పేరున్న వేణు గోపాల్‌ శనివారం కేరళలోని తిరువనంతపురంలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు. మోకాలి నొప్పితో ఇబ్బందిపడిన రాహుల్‌..యాత్రలో తన బదులుగా మరొకరిని పెట్టాలనుకున్నారని కూడా ఆయన చెప్పారు.

తన స్థానంలో సీనియర్‌ నేతలెవరికైనా ఆ బాధ్యతలను అప్పగించాలని సోదరి ప్రియాంకా గాంధీకి చెప్పారన్నారు. కన్యాకుమారి నుంచి యాత్ర మొదలైన మూడు రోజులకే రాహుల్‌ మోకాలి నొప్పి తీవ్రమైందన్నారు. అయితే, దేవుడి దయతో ఆ తర్వాత నొప్పి తగ్గిపోయిందని చెప్పారు. రాహుల్‌ నేతృత్వంలో గత ఏడాది సెప్టెంబర్‌ 7న మొదలైన భారత్‌ జోడో యాత్ర జనవరి 30న జమ్మూలో ముగిసిన విషయం తెలిసిందే. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top