ప్రాణాలు పోయేలా ఉన్నాయ్‌, ఇదెక్కడి విడ్డూరం: రాహుల్‌

Rahul Gandhi Hit Out At The Government For Not Admitted To Any Timeline On Vaccines   - Sakshi

న్యూఢిల్లీ: కోవిడ్‌ మహమ్మారితో ప్రజల ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉండగా, వ్యాక్సినేషన్‌ పూర్తి చేయడానికి గడువు లేదని కేంద్రం చెప్పడం విడ్డూరంగా ఉందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ విమర్శించారు. మహమ్మారి రోజుకోరకంగా విరుచుకుపడుతున్న నేపథ్యంలో దేశంలో కొనసాగుతున్న టీకా కార్యక్రమం పూర్తికి ప్రస్తుతానికి ఎలాంటి గడువు లేదంటూ శుక్రవారం లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనపై ఆయన ట్విట్టర్‌లో శనివారం స్పందించారు. ‘ఒక వైపు ప్రజల ప్రాణాలు ప్రమాదంలో ఉండగా, ప్రభుత్వం మాత్రం వ్యాక్సినేషన్‌ పూర్తికి గడువు లేదని ఒప్పుకుంది. ప్రభుత్వం చేతకాని తనానికి ఇదే నిదర్శనం’ అని పేర్కొన్నారు.
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top