Ayodhya: రూ.400 కోట్లతో బస్‌స్టేషన్‌

Proposal For Modern Bus Station Rs 400 Crore In Ayodhya - Sakshi

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రూ. 400 కోట్లతో బస్‌స్టేషన్‌ నిర్మించేందుకు సీఎం యోగి ఆదిత్యనాధ్‌ నేతృత్వంలో రాష్ట్ర కేబినెట్‌ సోమవారం ఆమోదం తెలిపింది. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో నిర్మాణం జరగనుందని మంత్రి సిద్దార్థ నాథ్‌ సింగ్‌ వెల్లడించారు. రామ మందిరానికి దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తారని, దాన్ని దృష్టిలో ఉంచుకొని నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు ఇందుకోసం 9 ఎకరాలు కేటాయిస్తున్నట్లు తెలిపారు.

భక్తులకు అవసరమైన అన్ని అవసరాలను పరిగణనలో ఉంచుకొని నిర్మాణం జరగనుందని స్పష్టం చేశారు. అయోధ్య–సుల్తాన్‌పుర్‌ రోడ్డులో నాలుగు లేన్ల ఫ్లై ఓవర్‌ నిర్మాణం కూడా చేపట్టనున్నట్లు తెలిపారు. భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకొని నిర్మించనున్న దీనికి రూ. 20 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. దీని పొడవు 1.5 కిలోమీటర్లు ఉంటుందని తెలిపింది. అలహాబాద్‌లో అనూప్‌షహార్‌–బులంద్‌షహర్‌ల మధ్య ఉన్న జీటీ రోడ్‌ వద్ద నాలుగు లేన్ల ఫ్లై ఓవర్‌ నిర్మాణానికి కూడా కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

చదవండి: అనుమతి వస్తే.. దేశంలో చిన్నారులకు తొలి కరోనా టీ​కా ఇదే!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top