అప్పటి వరకు ఒక స్టార్‌ హోటల్‌లోనే బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు: హైకమాండ్‌ ఆదేశం | Sakshi
Sakshi News home page

అప్పటి వరకు ఒక స్టార్‌ హోటల్‌లోనే బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు: హైకమాండ్‌ ఆదేశం

Published Sun, Jul 17 2022 7:11 PM

Presidential Election: Whip Says Bjp Lawmakers Stay In Same Star Hotel Karnataka - Sakshi

శివాజీనగర(బెంగళూరు): రాష్ట్రపతి ఎన్నికలు ముగిసేవరకు (జులై 18) తన 122 మంది ఎమ్మెల్యేలు, 25 మంది ఎంపీలు నగరంలో ఒక స్టార్‌ హోటల్‌లో బస చేయాలని బీజేపీ హైకమాండ్‌ ఆదేశించింది. ఈ మేరకు విప్‌ల చేత సమాచారం పంపింది.

రాష్ట్రపతి ఎన్నికల్లో ఏ విధంగా ఓటు చేయాలనేది హోటల్‌లోనే బోధిస్తారు. ఇందుకోసం ఢిల్లీలో ముగ్గురు నాయకులను శిక్షణనివ్వడానికి పంపించారని బీజేపీ వర్గాలు తెలిపాయి. అత్యవసర కారణాలతో మినహాయింపు కోరిన కొందరు మంత్రులు మినహాయించి మిగతా వారంతా హోటల్‌లో ఉండే అవకాశముంది. ఓటింగ్‌ రోజున హోటల్‌ నుంచి నేరుగా విధానసౌధకు చేరుకుంటారు. 

చదవండి: ఒక్కసారిగా రోడ్డు మధ్యలో భారీ గొయ్యి.. నెల క్రితమే నిర్మించారటా!

Advertisement
 
Advertisement
 
Advertisement