తొలి విడతలో 66 మందికి అవార్డుల అందజేత
ప్రదానం చేయనున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
తెలుగు రాష్ట్రాల నుంచి పద్మశ్రీకి పలువురు ఎంపిక
సాక్షి, న్యూఢిల్లీ: దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డుల ప్రదానోత్సవం రాష్ట్రపతి భవన్‌లో జరగనుంది. గణతంత్ర మండపంలో సోమవారం జరిగే ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము 2026 సంవత్సరానికి ఎంపికైన వారికి పురస్కారాలు అందజేస్తారు. ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, ప్రముఖులు ఈ వేడుకకు హాజరుకానున్నారు.
తొలి విడతలో 66 మందికి..
సామాన్యుల విశేష సేవలకు గుర్తింపుగా ఇచ్చే ఈ ‘పీపుల్స్ పద్మ’ అవార్డులను తొలి విడతలో భాగంగా 66 మందికి అందజేయనున్నారు. ఇందులో 2 పద్మవిభూషణ్, 6 పద్మభూషణ్, 58 పద్మశ్రీ పురస్కారాలు ఉన్నాయి. మిగిలిన అవార్డులను త్వరలో నిర్వహించే రెండో విడత కార్యక్రమంలో ప్రదానం చేస్తారు.
తెలుగు రాష్ట్రాల విజేతలు వీరే.. :
తెలంగాణ నుంచి:
⇒ చంద్రమౌళి గడ్డమనుగు (సైన్స్–ఇంజనీరింగ్)
⇒ దీపికా రెడ్డి (కళలు)
⇒ గూడూరు వెంకట్ రావు (వైద్యం)
⇒ కృష్ణమూర్తి బాలసుబ్రహ్మణ్యన్ (సైన్స్–ఇంజనీరింగ్)
⇒ కుమారస్వామి తంగరాజ్ (సైన్స్–ఇంజనీరింగ్)
⇒ పాల్కొండ విజయ్ ఆనంద్ రెడ్డి (వైద్యం)
⇒ మామిడి రామారెడ్డి (మరణానంతరం – ఇతర రంగాలు)
ఆంధ్రప్రదేశ్ నుంచి:
⇒ గద్దె బాబు రాజేంద్ర ప్రసాద్ (కళలు)
⇒ మాగంటి మురళీ మోహన్ (కళలు)
⇒ వెంపటి కుటుంబ శాస్త్రి (సాహిత్యం–విద్య)
⇒ గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ (మరణానంతరం – కళలు)


