సుప్రీంకోర్టుకు ఐదుగురు కొత్త న్యాయమూర్తులు.. కేంద్రం ప్రతిపాదనకు రాష్ట్రపతి ఆమోదం..

President Appoints Five New Judges To Supreme Court - Sakshi

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టుకు కొత్తగా మరో ఐదుగురు న్యాయమూర్తులు రానున్నారు. సుప్రీంకోర్టు కొలీజియం గతంలోనే సిఫారసు చేసిన ఐదుగురు న్యాయమూర్తుల పేర్లకు కేంద్రం ఆమోదం తెలిపింది. అనంతరం ఈ ప్రతిపాదనలను రాష్ట్రపతికి పంపింది. ప్రెసిడెంట్ ద్రౌపదిముర్ము కూడా దీనిపై సంతకం చేయడంతో సుప్రీంకోర్టుకు కొత్త న్యాయమూర్తుల నియామక ప్రక్రియ అధికారికంగా పూర్తయింది.

సుప్రీంకోర్టుకు కొత్తగా నియమించిన న్యాయమూర్తులు వీరే.

  1. జస్టిస్ పంకజ్ మిత్తల్, రాజస్థాన్ హైకోర్టు సీజే.
  2. జస్టిస్ సంజయ్ కరోల్, పాట్నా హైకోర్టు సీజే.
  3. జస్టిస్ పీవీ సంజయ్‌ కుమార్, మణిపూర్ హైకోర్టు సీజే.
  4. జస్టిస్ అహ్సనుద్దీన్ అమానుల్లా, పాట్నా హైకోర్టు జడ్జి.
  5. జస్టిస్ మనోజ్ మిశ్రా, అలహాబాద్ హైకోర్టు జడ్జి.

కొలీజియం సిఫారసు మేరకు ఐదుగురు నూతన న్యాయమూర్తులను త్వరలోనే నియమిస్తామని కేంద్రం సుప్రీంకోర్టుకు శుక్రవారమే తెలిపింది. ఆ మరునాడే నియామక ప్రక్రియ పూర్తి చేసింది. కేంద్రం కావాలనే న్యాయమూర్తలు నియామక ప్రక్రియను ఆలస్యం చేస్తోందని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం కేంద్రం తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో త్వరలోనే పక్రియ పూర్తి చేస్తామని కేంద్రం చెప్పింది.
చదవండి: పెండింగ్ చలాన్లపై 50 శాతం డిస్కౌంట్.. కట్టేందుకు ఎగబడ్డ జనం

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top