Maharashtra Viral: పిల్లి చేసిన పని...100 కోట్ల నష్టం

Power Cut Loss 100 Crore In Industrial Area Due To Cat Maharashtra - Sakshi

సాధారణంగా ఇళ్లలో జంతువులు చేసిన పనులు కొన్ని సార్లు నష్టాలను మిగిలేలా చేస్తాయి. తాజాగా ఓ పిల్లి కారణంగా లక్షలు కాదు, 100 కోట్లు నష్టాలను తెచ్చిపెట్టింది.  మహారాష్ట్రలోని పుణె పట్టణం శివార్లలో పింప్రీ-చించ్వడ్ ప్రాంత. ఇక్కడ పారిశ్రామిక ప్రాంతమైన భోసారిలో వ్యాపారస్తులు ఎక్కువ. ఓ పిల్లి ట్రాన్స్ ఫార్మర్ మీదకు ఎక్కడంతో అక్కడి కరెంట్ తీగలు తగలడంతో షార్ట్ సర్క్యూ్ట్ అయ్యింది.

దీంతో భోసారితో పాటు భోసారి ఎం.ఐ.డి.సీ ప్రాంతమంతా కరెంట్ అంతరాయం ఏర్పండింది. సుమారు 60 వేల మంది వినియోగదారులకు కరెంట్ సరఫరా కట్ అయ్యింది. ఫలితంగా దాదాపు 7000 మంది వ్యాపారస్తుల దుకాణాలకు పవర్ నిలిచిపోయింది. దీని వల్ల సుమారు రూ.100 కోట్ల రూపాయిలకు పైగా నష్టం వాటిల్లే అవకాశం ఉందని అంచనా వేశారు. మరల కరెంట్ సరఫరాను మళ్లీ పూర్తిస్థాయిలో పునరుద్ధరించాలంటే.. మూడు రోజులైనా పడుతుందని అధికారులు తెలిపారు. అయినా ఇంతటి నష్టానికి, కష్టానికి కారణం.. పిల్లి అంటే ఎవరూ నమ్మలేకపోతున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top