దాడి ఘటనపై మోదీ దిగ్బ్రాంతి | Sakshi
Sakshi News home page

దాడి ఘటనపై మోదీ దిగ్బ్రాంతి

Published Thu, Oct 19 2023 6:20 AM

PM Narendra Modi condemns Gaza hospital attack - Sakshi

న్యూఢిల్లీ:  గాజా ఆసుపత్రిలో బాంబు పేలుడులో పెద్ద సంఖ్యలో జనం మరణించడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్‌–హమాస్‌ ఘర్షణలో సాధారణ ప్రజలు బలి కావడం దురదృష్టకరమని వాపోయారు. ఈ మేరకు బుధవారం ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. ఇప్పటికైనా గాజాలో హింసకు తెరపడాలని ఆకాంక్షించారు.

ఆసుపత్రిలో బాంబు పేలుడుకు బాధ్యులైన వారిని తప్పనిసరిగా శిక్షించాలని నరేంద్ర మోదీ డిమాండ్‌ చేశారు. బాధితుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రారి్థస్తున్నట్లు తెలిపారు.

Advertisement
 
Advertisement