ఈ శతాబ్దంలోనే ఇది అత్యంత ఘోరమైన విషాదం: మోదీ

PM Narendra Modi Addresses The Nation On Covid - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ గడిచిన వందేళ్లలో వచ్చిన అతిపెద్ద మహమ్మారని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గతంలో ఇలాంటిది చూడలేదని, అనుభవించలేదని చెప్పారు. ఈ శతాబ్ధంలోనే ఇది అత్యంత ఘోరమైన విషాదం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం సాయంత్రం సెకండ్‌ వేవ్‌ తర్వాత మొదటి సారి ఆయన జాతినుద్ధేశించి ప్రసంగించారు.

ఈ సందర్భంగా.. ‘‘ కరోనా వచ్చిన తర్వాత దేశంలో వైద్య రంగాన్ని బలోపేతం చేశాం. రెండో వేవ్‌ వచ్చిన తర్వాత ఆక్సిజన్‌ డిమాండ్‌ విపరీతంగా పెరిగింది. గతంలో ఎప్పుడూ ఇలాంటి డిమాండ్‌ రాలేదు.  విమానాలు, రైళ్ల ద్వారా ఆక్సిజన్‌ సరఫరా చేశాం. కోవిడ్‌ నిబంధనలను అందరూ పాటించాలి. మాస్క్‌, భౌతిక దూరం పాటించాలి. వ్యాక్సిన్‌ రక్షణ కవచం లాంటిది. వ్యాక్సిన్‌ తయారు చేసే సంస్థలు ప్రపంచ వ్యాప్తంగా తక్కువగా ఉన్నాయి. విదేశాల నుంచి వ్యాక్సిన్‌ తెచ్చుకోవటం కఠినతరంగా ఉండేది. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. దేశంలో వందశాతం వ్యాక్సినేషన్‌కు ప్రణాళికలు రూపొందించాం. ఇందుకోసం మిషన్‌ ఇంద్రధనస్సును రూపొందించాం. ఇప్పుడు వ్యాక్సినేషన్‌ వేగవంతంగా జరుగుతోంది. వ్యాక్సినేషన్‌ వేగవంతం చేసే సమయంలోనే రెండో వేవ్‌ వచ్చింది. రెండు మేడిన్‌ ఇండియా వ్యాక్సిన్లను ప్రారంభించాం. కరోనాను ఎదురిస్తామనే విశ్వాసం అందరికీ ఉండాలి.

తక్కువ సమయంలోనే మన శాస్త్రవేత్తలు సఫలమయ్యారు. 23 కోట్ల మందికి ఇప్పటి వరకు వ్యాక్సినేషన్‌ వేశాం. వ్యాక్సిన్‌ టాస్క్‌ఫోర్స్‌ను కూడా ఏర్పాటు చేశాం. వ్యాక్సిన్‌ తయారు చేసే సంస్థలకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుంది. మౌలిక సదుపాయాలతోపాటు భారీగా నిధులు కూడా కేటాయిస్తాం. మరో 3 వ్యాక్సిన్ల ట్రయల్స్‌ తుదిదశలో ఉన్నాయి. వివిధ దేశాల్లో ఉన్న వ్యాక్సిన్ల కొనుగోలు.  కొంతమంది పిల్లలపై ఆందోళన వ్యక్తం చేశారు. నేజిల్‌ వ్యాక్సిన్‌పైనా పరిశోధనలు జరుగుతున్నాయి. ఇది సఫలమైతే పిల్లలకు సంబంధించిన వ్యాక్సినేషన్‌పైనా పరిశోధనలు జరుగుతాయి. ప్రపంచంలో చాలా తక్కువ దేశాల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ జరిగింది. వ్యాక్సినేషన్‌ కార్యక్రమానికి సంబంధించి డబ్ల్యూహెచ్‌ఓ నిబంధనలు పాటిస్తున్నాం. సీఎంల సమావేశంలో వచ్చిన సలహాలు, సూచనలు పాటించాం.

కరోనా వల్ల ఇబ్బంది పడేవారికే ప్రధానంగా వ్యాక్సిన్లు వేశాం.  కరోనా రెండోదశ వచ్చేలోపు ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు వ్యాక్సినేషన్‌ ప్రారంభించకపోతే పరిస్థితి ఎలా ఉండేదో ఊహించలేం. వైద్యులకు వ్యాక్సిన్‌ వేయడం వల్లే పరిస్థితి మెరుగ్గా ఉంది. వైద్యులు లక్షలాదిమంది ప్రాణాలను కాపాడారు . ఈ మధ్య అనేక సూచనలు, డిమాండ్లు మా ముందుకు వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వాలకు ఎందుకు కొనుగోళ్లు చేసే అవకాశం ఇవ్వట్లేదని ప్రశ్నించారు. లాక్‌డౌన్‌ విషయంలో రాష్ట్రాల డిమాండ్‌ను అంగీకరించాం. వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని వికేంద్రీకరించాలని రాష్ట్రాలు కోరాయి. మా పరిధిలో ఉన్న అంశాలు కేంద్రం ఎందుకు జోక్యం చేసుకుంటోందని ప్రశ్నించాయి. దేశంలోని మీడియాలో ఓ వర్గం ఇలాంటి డిమాండ్లపై ప్రచారం చేశాయి. మే 1 నుంచి వ్యాక్సిన్ల పంపిణీకి సంబంధించి రాష్ట్రాలకే ప్రాధాన్యత. వ్యాక్సిన్ల విషయంలో రాష్ట్రాలకే పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలనే డిమాండ్‌ ఉంది ’’ అని అన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

07-06-2021
Jun 07, 2021, 17:35 IST
సాక్షి, న్యూఢిల్లీ : వ్యాక్సినేషన్‌ బాధ్యత ఇకపై పూర్తిగా కేంద్రానిదేనని, కేంద్రమే పూర్తిగా వ్యాక్సిన్లను పంపిణీ చేస్తుందని ప్రధాని నరేంద్ర...
07-06-2021
Jun 07, 2021, 16:53 IST
రాష్ట్రంలో కోవిడ్‌ కారణంగా ఇప్పటివరకు 1,00,130 మంది మృతిచెందారని ఆరోగ్య శాఖ వెల్లడించింది.
07-06-2021
Jun 07, 2021, 15:51 IST
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కరోనా వైరస్‌ నివారణ చర్యలపై సోమవారం సమీక్ష నిర్వహించారు. డిప్యూటీ...
07-06-2021
Jun 07, 2021, 15:17 IST
న్యూఢిల్లీ​: దేశంలో కరోనా సెకండ్​వేవ్​ ఉధృతి తగ్గుతోంది. పాజిటివ్‌​ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పట్టిందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్​...
07-06-2021
Jun 07, 2021, 14:37 IST
కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా ఇబ్బందులు పడుతున్న ఎంతోమందికి సాయం చేస్తూ రియల్‌ హీరో అనిపించుకుంటున్నాడు కథానాయకుడు నిఖిల్‌ సిద్ధార్థ్‌....
07-06-2021
Jun 07, 2021, 13:51 IST
పిల్లలపై కరోనా టీకా కోవాగ్జిన్‌ ట్రయల్స్‌​  నిర్వహించేందుకు సమాయత్తం
07-06-2021
Jun 07, 2021, 12:16 IST
అసోం: కోవిడ్‌-19 సెకండ్‌ వేవ్‌ భయపెడుతున్న సమయంలో అసోంలోని కరోనా ఆసుపత్రి వైద్యులు మరోసారి వార్తల్లో నిలిచారు. సిల్చార్  వైద్యులు, ఆరోగ్య కార్యకర్తల బృందం  పాటలు...
07-06-2021
Jun 07, 2021, 11:35 IST
సాక్షి, గంగావతి(కర్ణాటక): కోవిడ్​ బారినుంచి కోలుకొని డిశ్చార్జ్​ కావాల్సిన ఓ మహిళ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. వివరాలు.. గదగ్​కు చెందిన...
07-06-2021
Jun 07, 2021, 10:04 IST
న్యూఢిల్లీ:  దేశంలో కరోనా కేసులు రోజురోజుకి తగ్గుముఖం పడుతున్నాయి. సుమారు రెండు నెలల తరువాత కోవిడ్‌ కేసులు లక్షకు దిగొచ్చాయి....
07-06-2021
Jun 07, 2021, 09:43 IST
విందుకు వచ్చిన మహారాష్ట్ర వాసుల కారణంగా గ్రామంలో కరోనా కేసులు
07-06-2021
Jun 07, 2021, 08:36 IST
చండీఘడ్‌:  దేశంలో కరోనా కేసులు ఇప్పుడిప్పుడే కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. పాజిటివ్​ కేసులు తగ్గినప్పటికి ఈ మహమ్మారి వ్యాప్తి మాత్రం...
07-06-2021
Jun 07, 2021, 05:55 IST
కంచికచర్ల (నందిగామ): ఓ విశ్రాంత ఉద్యోగి కరోనా వచ్చిందని మనస్తాపం చెంది గొంతు కోసుకున్న ఘటన ఆదివారం కంచికచర్లలో జరిగింది....
07-06-2021
Jun 07, 2021, 05:37 IST
తిరుపతి తుడా/పుత్తూరు రూరల్‌:  కరోనా సోకిన పదేళ్లలోపు చిన్నారులు తొమ్మిది మంది తిరుపతి రుయా పరిధిలోని చిన్నపిల్లల ఆస్పత్రిలో అడ్మిట్‌...
07-06-2021
Jun 07, 2021, 05:17 IST
ముత్తుకూరు: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆదివారం కరోనా నివారణకు ఆనందయ్య తయారు చేసిన ఆయుర్వేద మందును పంపిణీ చేశారు....
07-06-2021
Jun 07, 2021, 05:13 IST
చంద్రగిరి: కరోనాకు నెల్లూరు జిల్లా కృష్ణపటా్ననికి చెందిన ఆనందయ్య మందును చిత్తూరు జిల్లా చంద్రగిరిలో తయారు చేస్తున్నారు. ఈ సంప్రదాయ...
07-06-2021
Jun 07, 2021, 04:59 IST
మల్టీసిస్టం ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్‌ ఇన్‌ చిల్డ్రన్స్‌ (మిస్‌–సీ).. ఆందోళన వద్దంటున్న నిపుణులు
07-06-2021
Jun 07, 2021, 02:55 IST
సాక్షి, న్యూఢిల్లీ: నులిపురుగులను నియంత్రించే నిక్లోసమైడ్‌ ఔషధాన్ని కరోనా చికిత్స నిమిత్తం లక్సాయ్‌ లైఫ్‌ సైన్సెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సహకారంతో...
07-06-2021
Jun 07, 2021, 02:28 IST
సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌ సెకండ్‌వేవ్‌లో వ్యాప్తి చెందిన డెల్టా వేరియంట్‌ శరీరంలోని కీలక భాగాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. బి.1.617.2...
07-06-2021
Jun 07, 2021, 01:33 IST
కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గుదల ఆశావహ పరిస్థితులు కల్పిస్తోంది. కొన్ని రాష్ట్రాలు మినహా దేశవ్యాప్తంగా ఈ వాతావరణం నెలకొంటోంది....
06-06-2021
Jun 06, 2021, 21:03 IST
కృష్ణా: జిల్లాలో 33 కోవిడ్ ఆస్పత్రుల అనుమతి రద్దు చేస్తున్నట్లు జాయింట్‌ కలెక్టర్‌.. జిల్లా కోవిడ్‌ నోడల్‌ అధికారి శివశంకర్‌ ఆదివారం తెలిపారు. ప్రభుత్వ...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top