సీజేఐపై దాడికి యత్నం.. ప్రధాని మోదీ ఆగ్రహం | PM Modi Speaks To Chief Justice, Condemns Attack On Him | Sakshi
Sakshi News home page

సీజేఐపై దాడికి యత్నం.. ప్రధాని మోదీ ఆగ్రహం

Oct 6 2025 9:28 PM | Updated on Oct 6 2025 9:29 PM

PM Modi Speaks To Chief Justice, Condemns Attack On Him

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో ఓ కేసు విచారణ సమయంలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ (CJI Justice BR Gavai)పై దాడి చేసేందుకు ఓ న్యాయవాది యత్నించాడు. ఈ ఘటనపై ప్రధాని మోదీ స్పందించారు. సీజేఐపై దాడికి యత్నించిన ఘటనను మోదీ ఖండించారు. ఈ మేరకు సోమవారం (అక్టోబర్‌6న) ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు. 

ఆ ట్వీట్‌లో ‘భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్‌ గవాయ్‌తో మాట్లాడాను. ఈ రోజు సుప్రీం కోర్ట్ ప్రాంగణంలో జరిగిన ఘటన ప్రతి భారతీయుడిని ఆగ్రహానికి గురిచేసింది. మన సమాజంలో ఇలాంటి దారుణమైన చర్యలకు స్థానం లేదు. ఇది పూర్తిగా ఖండించదగిన చర్య. ఈ పరిస్థితిలో న్యాయమూర్తి గవాయ్ చూపిన శాంత స్వభావాన్ని నేను అభినందిస్తున్నాను. ఇది న్యాయ విలువల పట్ల ఆయన నిబద్ధతను, అలాగే మన రాజ్యాంగాన్ని బలపరిచేందుకు చేసిన ఆయన కృషిని ప్రతిబింబిస్తుంది’ అని పేర్కొన్నారు.

 

 
 

 

Advertisement
 
Advertisement
Advertisement