పాశమైలారం ఘటన బాధాకరం: ప్రధాని మోదీ | Pm Modi Expressed Shock Over The Pashamylaram Incident | Sakshi
Sakshi News home page

పాశమైలారం ఘటన బాధాకరం: ప్రధాని మోదీ

Jun 30 2025 4:18 PM | Updated on Jun 30 2025 4:47 PM

Pm Modi Expressed Shock Over The Pashamylaram Incident

ఢిల్లీ: సంగారెడ్డి ఫ్యాక్టరీ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చాలా మంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమన్నారు. తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. మృతుల బంధువులకు పీఎంఎన్‌ఆర్‌ఎఫ్‌ నుండి రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50,000 ఎక్స్ గ్రేషియా అందిస్తాం’’ అని ప్రధాని మోదీ తెలిపారు.

పటాన్‌చెరు పారిశ్రామికవాడ పాశమైలారంలో సోమవారం ఉదయం ఘోర ప్రమాదం సంభవించింది. సిగాచి కెమికల్స్‌ పరిశ్రమలో రియాక్టర్‌ పేలింది. పేలుడు ధాటికి కంపెనీకి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్‌ బిల్డింగ్‌, మ్యాన్‌ఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ సహా చాలా భాగం దెబ్బతింది. ఆ సమయంలో అడ్మినిస్ట్రేషన్‌ బిల్డింగ్‌ పరిసరాల్లోనే భారీ సంఖ్యలో కార్మికులు ఉన్నట్లు సమాచారం.
 

Advertisement
 
Advertisement
Advertisement