సార్వత్రిక ఎన్నికల వేళ.. మార్చి3న కేంద్ర కేబినెట్‌ భేటీ

PM Modi To Chair Cabinet Meet On March 3 Lok Sabha elections - Sakshi

ఢిల్లీ: పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో మార్చి 3న కేంద్ర మంత్రిమండలి సమావేశం కానుంది. ఢిల్లీ చాణక్యపురిలోని సుష్మాస్వరాజ్‌ భవన్‌లో కేబినెట్‌ భేటీ ఉంటుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.  లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి మార్చి రెండో వారంలో షెడ్యూల్‌ ప్రకటించే అవకాశాలున్నట్లు వార్తలు వస్తున్నాయి.

దేశ వ్యాప్తంగా జరిగే లోక్‌సభ ఎన్నికల ప్రకటనకు కొన్ని రోజుల ముందే.. కేబినెట్‌ భేటీ కానుండటంతో ప్రాధాన్యం సంతరించుకుంది. ఒకవైపు.. లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా కసరత్తు చేస్తోంది. ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో పర్యటించి.. ఎన్నికల సంసిద్ధతను పర్యవేక్షిస్తోంది.  2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ మార్చి 9 తర్వాత ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. లోక్‌సభతో పాటు ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం శాసనసభలకు 2024 మేలోగా ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇక.. వీటితోపాటు జమ్మూకశ్మీర్‌లోనూ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఈసీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

గతంలో 2014 లోక్‌సభ ఎన్నికలను తొమ్మిది విడతల్లో కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించింది. మార్చి 5న ఎన్నికల ప్రక్రియ మొదలై మే 16న ఫలితాలు వెలువడ్డ విషయం తెలిసిందే.  2019లో మాత్రం లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ను ఏడు దఫాల్లో నిర్వహించింది. మార్చి 10న ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాగా మే 23న ఫలితాలను ఈసీ విడుదల చేసింది.

చదవండి: కాంగ్రెస్ అకౌంట్‌ నుంచి రూ. 65 కోట్లు రిక‌వ‌రీ చేసిన ఐటీ

whatsapp channel

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top