Fact Check: భారత్‌లో కోవిడ్‌ భయాలు.. స్కూళ్లు, కాలేజీలకు కరోనా సెలవులు! నిజమెంత?

Pib Fact Check Schools Colleges Not To Be Closed Amidst Covid - Sakshi

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కొత్త వేరియంట్ వెలుగుచూసిన కారణంగా త్వరలో స్కూళ్లు, కాలేజీలు బంద్ చేస్తారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. లాక్‌డౌన్ కూడా విధించే అవకాశం ఉందని వార్తలు వ్యాప్తి చెందుతున్నాయి. 

అయితే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వీటిపై స్పందించింది. ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని చెప్పింది. ఇదంతా నిరాధారమైన ఫేక్ న్యూస్ అని కొట్టిపారేసింది. స్కూళ్లు, కాలేజీలకు 15 రోజులు సెలవులు ప్రకటిస్తారనే బోగస్ వార్తలను ఎవరూ నమ్మవద్దని పేర్కొంది. వాస్తవాలు తెలుసుకోవాలని ప్రజలకు సూచించింది. ఈ మేరకు ఫ్యాక్ట్ చెక్ చేసి ట్విట్టర్‌లో పోస్టు చేసింది.

మరోవైపు చలి తీవ్రత బాగా పెరగడంతో కాన్పూర్, నోయిడా లక్నో, బిహార్, జార్ఖండ్, పంజాబ్, ఢిల్లీలోని పలు పాఠశాలలను మూసివేశారు. పొగమంచు కారణంగా కొన్ని చోట్ల స్కూళ్ల సమయాన్ని మార్చారు. అంతేగానీ కరోనా కారణంగా సెలవులు ప్రకటించలేదు.
చదవండి: భారత్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్‌ను అరికట్టడం ఎలా?

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top