పెట్రో బాదుడు : రూ.100 దాటేసింది | Petrol crosses Rs 100 in Rajasthans Ganganagar | Sakshi
Sakshi News home page

పెట్రో బాదుడు : రూ.100 దాటేసింది

Feb 17 2021 10:21 AM | Updated on Feb 17 2021 2:30 PM

 Petrol crosses Rs 100 in Rajasthans Ganganagar - Sakshi

వరుసగా 9 వ పెంపు నేపథ్యంలో రాజస్థాన్‌లోని గంగానగర్ జిల్లాలో పెట్రోల్ ధర బుధవారం (ఫిబ్రవరి 17) రూ .100.13 పలుకుతోంది.  

సాక్షి, జైపూర్‌:  దేశవ్యాప్తంగా పెరుగుతున్న పెట్రోలు, డీజిల్‌ ధరలు  వాహన దారులను బెంబేలెత్తిస్తున్నాయి. వరుస  పెంపుతో రికార్డు స్థాయిలనుచేరుతున్నాయి. ఇప్పటికే జైపూర్‌లో పెట్రోలు ధర  రూ.100 మార్క్‌ను టచ్‌ చేసింది. తాజాగా 100 రూపాయలను అధిగమించి వినియోగదారుల గుండెల్లో బాంబు  పేల్చింది.‌ వరుసగా 9వ పెంపు నేపథ్యంలో  ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ గణాంకాల ప్రకారం రాజస్థాన్‌లోని గంగానగర్ జిల్లాలో పెట్రోల్ ధర బుధవారం (ఫిబ్రవరి 17) రూ .100.13 పలుకుతోంది. డీజిల్ ధర లీటరుకు 92.13 రూపాయలుగా ఉంది. పెట్రోలు ధరకు సంబంధించి దేశవ్యాప్తంగా ఇదే అత్యధిక ధర.  (భగ్గుమంటున్న పెట్రోలు, డీజిల్‌ ధర)

Advertisement
 
Advertisement
Advertisement