పార్లమెంట్‌ క్యాంటీన్‌లో ఏమేమి దొరుకుతాయి? వెజ్‌, నాన్‌ వెజ్‌ ధరలు ఎంత? | Sakshi
Sakshi News home page

పార్లమెంట్‌ క్యాంటీన్‌లో ఏమేమి దొరుకుతాయి? ధరలు ఎంత?

Published Wed, Sep 20 2023 10:59 AM

Parliament of India Canteen Menu Rate List - Sakshi

నూతన పార్లమెంట్‌ భవనంలో ప్రత్యేక సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇకపై ఇక్కడే పార్లమెంట్‌ కార్యకలాపాలన్నీ కొనసాగనున్నాయి. అయితే పార్లమెంటు గురించి మాట్లాడినప్పుడల్లా అక్కడి క్యాంటీన్ గురించిన ప్రస్తావన వస్తుంది. పార్లమెంటు క్యాంటీన్‌లో అతి చౌక ధరలకు లభించే ఆహార పదార్థాల గురించి సోషల్ మీడియాలో చర్చ సాగుతుంటుంది. పార్లమెంటు క్యాంటీన్‌లో ఏ ఆహారం ఎంత ధరకు దొరుకుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

2021వ సంవత్సరంలో పార్లమెంట్ క్యాంటీన్ రేట్ లిస్ట్‌లో మార్పులు చేశారు. ఇండియా టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ 2021లో క్యాంటీన్ రేట్లను సవరించింది. దీంతో పలు ఆహార పదార్థాల రేట్లు పెరిగాయి. ఉదాహరణకు గతంలో చపాతీ రేటు రూ.2 ఉండగా, తర్వాత  దానిని రూ.3కి పెంచారు. అలాగే చికెన్, మటన్ వంటకాల రేట్లు కూడా పెంచారు. పార్లమెంట్‌ క్యాంటీన్‌లో ఆహార పదార్థాల ధరలు ఇలా ఉన్నాయి.  

ఆలూ బోండా రూ.10, చపాతీ రూ.3, పెరుగు రూ.10, దోశ రూ.30, లెమన్ రైస్ రూ.30, మటన్ బిర్యానీ రూ.150, మటన్ కర్రీ రూ.125, ఆమ్లెట్ రూ.20, ఖీర్ రూ.30, ఉప్మా రూ.25, సూప్ రూ.25, సమోసా రూ.10, కచోరీ రూ. 15, పనీర్ పకోడా రూ. 50కు దొరుకుతుంది.  
ఇది కూడా చదవండి: ఏఏ దేశాల్లో వరద ముప్పు అధికం? దీనికి ప్రధాన కారణం ఏమిటి?

Advertisement
 
Advertisement
 
Advertisement