యూసీసీకి మతం రంగు పులమొద్దు: రాజ్‌నాథ్‌ సింగ్‌ | Opposition giving communal twist to Uniform Civil Code | Sakshi
Sakshi News home page

యూసీసీకి మతం రంగు పులమొద్దు: రాజ్‌నాథ్‌ సింగ్‌

Jun 29 2023 5:38 AM | Updated on Jun 29 2023 5:38 AM

Opposition giving communal twist to Uniform Civil Code - Sakshi

జోద్‌పూర్‌: దేశంలో ఉమ్మడిపౌర స్మృతి(యూసీసీ) అమలు గురించి కేంద్ర ప్రభుత్వం మాట్లాడినప్పుడల్లా ప్రతిపక్షాలు మతం కోణాన్ని తెరపైకి తీసుకొస్తున్నాయని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆరోపించారు. సమాజాన్ని చీల్చే రాజకీయాలు చేయొద్దని విపక్షాలకు హితవు పలికారు.

యూసీసీకి మతం రంగు పులమొద్దని సూచించారు. రాజ్యాంగం ప్రకారమే ముందుకెళ్తున్నామని, ప్రజలకు ఇచ్చిన హామీని అమలు చేయాలన్నదే తమ ఉద్దేశమని స్పష్టం చేశారు. ఆయన బుధవారం రాజస్తాన్‌లో ఓ కార్యక్రమంలో ప్రసంగించారు. మహిళల గౌరవాన్ని కాపాడే విషయంలో మోదీ ప్రభుత్వం చిత్తశుద్ధితో, అంకితభావంతో పని చేస్తోందన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement