చంపుతామంటున్నారు.. | Nusrat Jahan Gets Death Threats | Sakshi
Sakshi News home page

బెదిరింపులొస్తున్నాయ్‌.. రక్షణ కల్పించండి

Oct 1 2020 8:53 AM | Updated on Oct 1 2020 11:26 AM

Nusrat Jahan Gets Death Threats - Sakshi

సోషల్‌ మీడియా ద్వారా తనకు చంపుతామని బెదిరింపులు వస్తున్నాయని నటి నుస్రాత్‌ జహాన్ తెలిపారు.

కోల్‌కతా: సోషల్‌ మీడియా ద్వారా తనకు చంపుతామని బెదిరింపులు వస్తున్నాయని, అందువల్ల రక్షణ కల్పించాలంటూ తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ, నటి నుస్రాత్‌ జహాన్‌ భారత హై కమిషన్‌ కు లేఖ రాశారు. ప్రస్తుతం ఆమె బెంగాలీ సినిమా షూటింగ్‌ లో భాగంగా లండన్‌లో ఉన్నారు. దుర్గా అమ్మవారి రూపంతో మహిషాసురమర్థినిలా త్రిశూలం పట్టుకొని తీసిన ఓ వీడియోను పోస్ట్‌ చేశాక బెదిరింపులు వస్తున్నట్లు తెలిపారు. ఎంపీగా సాధారణంగానే ఆమెకు భద్రత ఉంటుంది.

అయితే బెదిరింపుల నేపథ్యంలో పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వం, విదేశాంగ శాఖల ద్వారాఅదనపు భద్రత కూడా ఏర్పాటైనట్లు సమాచారం అందింది. తనకు రక్షణ కావాలంటూ భారత హైకమిషన్‌ కు రాసిన లేఖలో ఆమెకు వచ్చిన బెదిరింపులకు సంబంధించిన స్క్రీన్‌ షాట్లను కూడా ఉంచినట్లు తెలిపారు. సింధూరం ధరించడం వంటి చర్యల కారణంగా గతంలో ఆమెను కొందరు ముస్లింలు ట్రోల్‌ చేసిన సంగతి తెలిసిందే. (చదవండి: యూపీ నిర్భయ పట్ల అమానవీయం)

Advertisement
 
Advertisement
Advertisement