NCP Ajit Pawar Says KCR Would Not Succeed In Maharashtra Politics, Details Inside - Sakshi
Sakshi News home page

అక్కడ కేసీఆర్‌ ప్లాన్స్‌ ఫలించవు.. అజిత్‌ పవార్‌ ఆసక్తికర కామెంట్స్‌

Jun 20 2023 10:17 AM | Updated on Jun 20 2023 11:36 AM

NCP Ajit Pawar Says KCR Would Not Succeed In Maharashtra Politics - Sakshi

పూణే: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ దేశ రాజకీయాలపై దృష్టిపెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బీఆర్‌ఎస్‌ పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు. పలు రాష్ట్రాల్లో పార్టీని విసర్తిస్తూ.. బీఆర్‌ఎస్‌లో చేరికలు, పార్టీ ఆఫీసులను ప్రారంభిస్తున్నారు. ఇక, తాజాగా మహారాష్ట్రలో కొందరు కీలక నేతలు బీఆర్‌ఎస్‌లో చేరడంతో కేసీఆర్‌.. అక్కడి రాజకీయాలపై ఫోకస్‌ పెంచారు. 

ఈ నేపథ్యంలో కేసీఆర్‌ వ్యూహాలపై ఎన్సీపీ నేత అజిత్‌ పవార్‌ స్పందించారు. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో పార్టీని విస్తరించాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. కానీ, ఆయన సక్సెస్ కాలేరని అజిత్ పవార్ ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. ఆ పార్టీలో చేరుతున్న వారికి ఇక్కడ అవకాశం రాదని తెలుసు అంటూ కామెంట్స్‌ చేశారు.

మూలయం, మాయవతి కూడా..
కాగా, అజిత్‌ పవార్‌ పూణెలో మీడియాతో మాట్లాడుతూ.. మాయావతి, ములాయం సింగ్ వంటి సీనియర్‌ నేతలు ఇప్పటికే మహారాష్ట్రలోకి అడుగుపెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. ఇక్కడ రాజకీయాలు చేయడంలో విఫలమయ్యారు. వీరిద్దరూ ముఖ్యమంత్రులుగా ఉన్న సమయంలో మహారాష్ట్రలో వారి పార్టీలను విస్తరించాలని ప్లాన్స్‌ చేశారు. కానీ, ఆశించిన స్థాయిలో పార్టీలను, ప్రజలను ప్రభావితం చేయడంలో సక్సెస్‌ కాలేదని వెల్లడించారు. కేసీఆర్‌.. జాతీయ స్థాయి నాయకుడు కావాలని ఎంతో ఆశపడుతున్నారు. ఈ క్రమంలోనే కేసీఆర్‌.. బీఆర్‌ఎస్‌ పార్టీని విస్తరించే పనిలో ఉన్నారని అన్నారు.  

డబ్బంతా ఎక్కడది..
ఇక, ఇదే సమయంలో కేసీఆర్‌ సర్కార్‌పై అజిత్‌ పవర్‌ తీవ్ర విమర్శలు చేశారు. దేశం, రాష్ట్రంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం ఎక్కువగా ఉన్న సమయంలో బీఆర్ఎస్ పార్టీ ప్రచారాల కోసం హోర్డింగులు, ప్రకటనలు, యాడ్స్‌, బ్యానర్లు, విపరీతంగా ఖర్చు చేస్తున్నారని అన్నారు. ఈ డబ్బంతా కేసీఆర్ కు ఎక్కడ నుంచి వస్తోందనే విషయం గురించి ప్రజలు ఆలోచించాలని సూచించారు.

ఇది కూడా చదవండి: మహిళల ఉచిత ప్రయాణంలో మార్పులు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement