స్విమ్మింగ్ పూల్ గా మారిన ముంబై లోకల్ రైల్వే స్టేషన్ 

Navi Mumbai Railway Station Turns Into A Swimming Pool - Sakshi

ముంబై: కొద్దిరోజులుగా ఆగకుండా కురుస్తున్న వానలకు నవీ ముంబైలో నూతనంగా నిర్మిస్తున్న రైల్వే స్టేషన్లోకి నీళ్లు చేరాయి. దీంతో స్థానిక యువత అక్కడ నీటిలో జలకాలాడుతూ వీడియో తీసి వర్షం పడితే ఆ లోకల్ రైల్వే స్టేషన్ పరిస్థితి ఏంటనేది కళ్ళకు కట్టారు.   

రుతుపవనాల రాకతో కొద్ది రోజులుగా ముంబైలో కురుస్తున్న వర్షాలకు ఎక్కడికక్కడ రోడ్ల మీద వరదనీరు నిలిచిపోగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఇదిలా ఉండగా నవీ ముంబైలోని ఉరాన్ లోకల్ రైల్వే స్టేషన్ ఐతే స్విమ్మింగ్ పూల్ ని తలపిస్తూ నిండుగా నీళ్లు చేరాయి. దీంతో యువత అందులో హాయిగా జలకాలాడారు. ఆ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో ఎక్కడెక్కడో విహరిస్తోంది. 

నూతనంగా నిర్మిస్తున్న ఈ రైల్వే స్టేషన్లో నీరు లీక్ అవుతుండడంతోనే ఇంతగా నీరు చేరిందంటున్నారు స్థానికులు. పైగా ఇక్కడి డ్రైనేజి వ్యవస్థ అయితే అత్యంత అధ్వానంగా ఉండడంతో నీరు బయటకు పోయే మార్గమే లేదంటున్నారు స్థానికులు. ఈ వీడియో చూసైనా సిగ్గు తెచ్చుకోండని అధికారులని ఏకిపారేస్తున్నారు నెటిజన్లు. 

ఇది కూడా చదవండి: రైలుకు వేలాడుతూ బిత్తిరి చర్య.. పట్టుతప్పితే అంతే సంగతులు! 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top