కొచ్చి నేవీ కేంద్రంలో హెలికాప్టర్‌ ప్రమాదం | Sakshi
Sakshi News home page

కొచ్చి నేవీ కేంద్రంలో హెలికాప్టర్‌ ప్రమాదం

Published Sun, Nov 5 2023 6:20 AM

Naval sailor killed in Chetak helicopter accident in Kochi - Sakshi

కొచ్చి/న్యూఢిల్లీ: కొచ్చి నావికా కేంద్రంలో శనివారం జరిగిన ప్రమాదంలో నేవీకి చెందిన ఒక నావికుడు ప్రాణాలు కోల్పోయారు. ఐఎన్‌ఎస్‌ గరుడపై ట్యాక్సీ చెకింగ్‌ సమయంలో చేతక్‌ హెలికాప్టర్‌ అనుకోకుండా ప్రమాదానికి గురైంది.

ఈ ఘటనలో లీడింగ్‌ ఎయిర్‌ మ్యాన్‌ యోగేంద్ర సింగ్‌ ప్రాణాలు కోల్పోయారని నేవీ ఒక ప్రకటనలో తెలిపింది. ఘటనపై బోర్డ్‌ ఆఫ్‌ ఎంక్వైరీకి ఆదేశించినట్లు వెల్లడించింది. నేవీ చీఫ్‌ అడ్మిరల్‌ ఆర్‌.హరికుమార్‌ యోగేంద్ర సింగ్‌ మృతికి సంతాపం ప్రకటించారని వివరించింది. యోగేంద్ర సింగ్‌ స్వరాష్ట్రం మధ్యప్రదేశ్‌ అని తెలిపింది.

Advertisement
 
Advertisement