
న్యూఢిల్లీ: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్) నుంచి భారత్‌లోని గంగా నది డెల్టా ప్రాంతం కనువిందు చేస్తోంది. నాసా వ్యోమగామి డాన్ పెటిట్ ఈ ఫోటోను చిత్రీకరించారు. సోషల్ మీడియాలో పోస్టుచేశారు. గంగా నది డెల్టా ప్రపంచంలోనే అతిపెద్ద రివర్ డెల్టాగా గుర్తింపు పొందింది. తూర్పు భారతదేశం, బంగ్లాదేశ్‌లో విస్తరించి ఉంది. సారవంతమైన భూములు, పచి్చక బయళ్లకు పెట్టింది పేరు. దీన్ని గంగా–బ్రహ్మపుత్ర డెల్టా లేదా బెంగాల్ డెల్టా లేదా సుందర్బన్స్ డెల్టా అని కూడా అంటారు.
విస్తీర్ణం లక్ష చదరపు కిలోమీటర్లకు పైమాటే. లక్షలాది మందికి ఇదొక జీవరేఖ. డాన్ పెటిట్ నియర్–ఇన్‌ఫ్రారెడ్ ఫోటోగ్రఫీతో ఈ చిత్రాన్ని బందించారు. నదులు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ ఫోటోకు సోషల్ మీడియాలో, సైన్స్ చానళ్లలో ప్రశంసల వర్షం కురుస్తోంది. నెటిజన్లు డాన్ పెటిట్‌ను అభినందిస్తూ పోస్టులు పెడుతున్నారు. సాంకేతిక పరిజ్ఞానమే కాకుండా కళాత్మక దృష్టి కూడా ఇందులో కనిపిస్తోంది.