ఐఎస్‌ఎస్‌లో అమెరికా వ్యోమగామి ‘బిహూ’ | NASA Astronaut Mike Fincke Performs Bihu Dance in Space | Sakshi
Sakshi News home page

ఐఎస్‌ఎస్‌లో అమెరికా వ్యోమగామి ‘బిహూ’

Apr 20 2026 6:07 AM | Updated on Apr 20 2026 6:07 AM

NASA Astronaut Mike Fincke Performs Bihu Dance in Space

గువాహటి: అమెరికా వ్యోమగామి మైక్‌ ఫిన్‌కె (59) అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)లో అస్సాం సంప్రదాయ నృత్యం బిహూను ప్రదర్శించి అలరించారు. అస్సాంలో నూతన సంవత్సరాది ‘రొంగలి బిహూ’ జరుపుకుంటున్న వేళ ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. అందులో ఫిన్‌కె అస్సాం సంప్రదాయ కండువా వేసుకుని బిహూ నృత్యం చేస్తూ కన్పిస్తున్నారు. 

ఆయన అస్సాంకు చెందిన రెనిటా సైకియాను పెళ్లాడారు. రెండు రోజుల క్రితం అప్‌లోడ్‌ చేసిన వీడియోను ఎప్పుడు తీశారనేది వెల్లడి కాలేదు. దీనిపై అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ హర్షం వెలిబుచ్చారు. అస్సాం సంసృతీ సంప్రదాయాల గొప్పతనం విశ్వవ్యాప్తమైందని ఎక్స్‌ పోస్ట్‌లో ఆయన పేర్కొన్నారు. ఫిన్‌కె 2004లో ఐఎస్‌ఎస్‌కు వెళ్లినప్పుడు కూడా ఇలాంటి వీడియోను షేర్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement