మ్యాన్‌ హోల్‌లో పడి.. సముద్రంలో శవమై..

Mumbai Woman Falls In Manhole Body Found 22 km Away On Wrong Side - Sakshi

ముంబైలో దారుణ ఘటన

మహిళ అనుమానాస్పద మృతి

దర్యాప్తు చేపట్టిన పోలీసులు

ముంబై: దేశ వాణిజ్య రాజధాని ముంబైలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మురికి కాలువలో పడిన ఓ మహిళ కొన్ని గంటల తర్వాత సముద్రంలో శవమై తెలిన ఘటన బీఎంసీ అధికారులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మహరాష్ట్రలోని ఘాట్కోపర్ వద్ద ఈ నెల 3న జరిగిన ఈ ఘటనపై బీఎంసీ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతి చెందిన సదరు మహిళల షీతల్‌ దామాగా అధికారులు గుర్తించారు. అధికారుల సమాచారం ప్రకారం.. 32 ఏళ్ల షీతల్‌ అక్టోబర్‌ 3న తన కుమారుడితో కలిసి బయటకు వెళ్లింది. ఆ రోజు ముంబైలో అధికారులు భారీ వర్ష సూచన ఇవ్వడంతో తన కుమారుడిని ఇంటికి పంపించింది. అనంతరం ఎన్ని గంటలు గడిచిన షీతల్‌ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆమె కోసం గాలించారు. (చదవండి: ప్లాన్‌ బెడిసికొట్టింది.. ఈసారి భార్య కూడా)

ఓ మ్యాన్‌ హోల్‌ వద్ద తన హ్యాండ్‌ బ్యాగ్‌ దొరకడంతో ఆమె మురికి కాలువలో పడి ఉంటుందని అభిప్రాయపడి బీఎంసీ అధికారులకు సమాచారం ఇచ్చారు. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు సమీపంలోని మహీమ్‌, టాండెయో, బాంద్రా-కుర్లా ప్రాంతాల్లో అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. 33 గంటల తర్వాత ఆమె మృతదేహాన్ని అధికారులు హాజీ అలీ సమీపంలోని సముద్రంలో కనుగొన్నారు. ఘట్కోపర్‌ మ్యాన్‌ హోల్‌ వద్ద మునిగిన ఆమె సముద్రంలో కనిపించడంపై అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఆమె పడిన మ్యాన్‌ హోల్‌ ద్వారా మానవ దేహం 22 కిలోమీటర్లు ప్రయాణించేందుకు అవకాశం లేదని బీఎంసీ అధికారులు పర్కొన్నారు. ఈ ప్రాంతంలోని మురికి కాలువల 3 చోక్‌ పాయింట్లకు అనుసంధానం అయి ఉందని, అక్కడ ఆమె శరీరం ఇరుక్కోని ఉండాలన్నారు. కానీ అలా జరగ లేదు. అంతేగాక ఘట్కోపర్‌ నుంచి ఆమె మృతదేహాం తెలుతూ ఉండటం కూడా నమ్మశక్యం కానీ విషయం అన్నారు. మృతురాలు పడిన మురికి కాలువ మహీం వైపు ఉందని, వర్లీ నల్లా కాదని అని బీఎంసీ అధికారులు వెల్లడించారు. అంతేగాక ఆ మురికి నీటి మార్గం మానవ శరీరం పట్టేంత పెద్దది కూడా కాదని అధికారులు స్పష్టం చేశారు. షీతల్‌ మృతి కారణాలను కనుగొనేందుకు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. (చదవండి: కుక్కల్లా మొరిగిన వారు ఇప్పుడేం చెబుతారు!)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top