చిక్కుల్లో ఫడ్నవీస్‌.. మాజీ సీఎంకు పోలీసుల నోటీసులు

Mumbai Police Summons Devendra Fadnavis To Appear On Sunday In Phone Tapping Case - Sakshi

ముంబై: అక్రమంగా ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడిన కేసులో తమ ఎదుట హాజరుకావాలని ముంబై పోలీసులు బీజేపీ నేత, మహరాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు నోటీసులు జారీ చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్న ఫడ్నవీస్‌ను ఆదివారం ఉదయం 11 గంటలకు బీకేసీ సైబర్‌ పోలీస్‌స్టేషన్‌లో హాజరై వాంగ్మూలం ఇవ్వాలని సూచించారు. ఐపీఎస్ అధికారి రష్మీ శుక్లా రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగానికి నేతృత్వం వహిస్తున్న సమయంలో అక్రమ ఫోన్ ట్యాపింగ్‌పై నమోదైన కేసులో ఫడ్నవీస్ సాక్షి అని రాష్ట్ర ప్రభుత్వం గతంలో కోర్టుకు తెలిపింది. 

నోటీసులు అందిన అనంతరం ఆయన వీటిని ట్వీటర్‌లో షేర్‌ చేశారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర ప్రభుత్వంపై మాజీ సీఎం ఫైర్‌ అయ్యారు. బదిలీ పోస్టింగ్ స్కాంపై రాష్ట్ర ప్రభుత్వం ఆరు నెలలుగా ఏమీ చేయకపోవడం తనను ఆశ్చర్యపరిచిందని అన్నారు. మహరాష్ట్ర ప్రభుత్వం చర్యల్లో తప్పులను బయటపెట్టినందుకే తనకు నోటీసులు అందాయి. అయినా తాను ఇలాంటి వాటికి భయపడనని ఈ కేసు దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నట్లు దేవేంద్ర ఫడ్నవిస్ అన్నారు. రాష్ట్ర పోలీసు శాఖలో బదిలీల కుంభకోణాన్ని తాను బయటపెట్టినందున రాష్ట్ర ప్రభుత్వం తనపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తోందని తెలిపారు. అయితే ఫడ్నవీస్‌ ఈ నోటీసులకు సమాధానం ఇవ్వడంతో పాటు ముంబై పోలీసుల ముందు హాజరు కావాలని కోరింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top