Mumbai Eatery Selling Bahubali Gold Momos Weighing Two Kilograms - Sakshi
Sakshi News home page

బాహుబలి గోల్డ్‌ మోమోస్‌.. ధర తెలిస్తే నోరు వెళ్లబెట్టాల్సిందే

Oct 19 2021 2:00 PM | Updated on Oct 19 2021 4:43 PM

Mumbai Eatery Selling Bahubali Gold Momos Weighing Two Kilograms - Sakshi

ముంబై: మనం రెస్టారెంట్లో వేరైటీ వైరైటీ వంటకాలను సరదాగా ట్రై చేసి చూస్తాం కదా. కానీ ఒక్కోసారి బాగుంటాయి ఒక్కొక్కసారి అబ్బా ఎందుకు ఆర్డర్‌ చేశామా అని అనిపిస్తుంది. కొన్ని వంటకాలను మనం ట్రై చేయాలన్న కష్టమనిపిస్తుంది. ఎందుకంటే మనం ఎప్పుడూ చూడని వంటకం ఒక కారణం అయితే దాని ధర గురించి కూడా ఆలోచించి మానేస్తాం. అలాంటి కొత్త వంటకం ఒకటి ముంబైలోని మెస్సీ అడ్డా అనే రెస్టారెంట్‌ పరిచయం చేస్తుంది.

(చదవండి:  అదో వింతైన రంగురంగుల బల్లి.. ప్లీజ్‌ కాపాడండి)

మోమోస్‌ అనే వంటకాన్ని రకరకాలుగా తయారు చేయడం గురించి వినే ఉంటాం. కానీ మెస్సీ అడ్డా రెస్టారెంట్‌ మాత్రం అందుకు భిన్నంగా భారీ బాహుబలి గోల్డ్ మోమోలనే సరికొత్త రెసీపీని విక్రయిస్తోంది. పైగా దీనిలో 24 క్యారెట్ల బంగారం కూడా ఉంటుందంట. అంతేకాదు సూమారు 2 కిలోలు బరువు ఉండే ఈ బాహుబలి మోమోస్‌ ధర రూ.1,299తో అట. అంతే కాదండోయ్‌ ఒక ఆరెంజ్ మింట్ మోజిటో, రెండు చాక్లెట్ మోమోలు, మూడు చట్నీలు, మాయో డిప్‌తో సర్వ్‌ చేస్తారు.

కానీ గతంలో కూడా దుబాయ్‌, న్యూఢిల్లీలోనూ బంగారంతో తయారు చేసిన వంటకాలను చూశాం కానీ వాటిన్నంటికంటే భిన్నంగా ఈ ముంబై రెస్టారెంట్‌ బాహుబలి మోమోస్‌ అంటూ అ‍త్యంత ఖరీదుతో విక్రయిస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించి వీడియో ఒకటి వైరల్‌ అవుతుంది. దీంతో నెటిజన్లు ఒక్కసారి ట్రై చేయాల్సిందే అని  ఒకరు, మరొకరెమో డబ్బు వృధా అంటు రకరకాలు ట్వీట్‌ చేస్తున్నారు.

(చదవండి: వీడియో క్యాసెట్ల స్టోర్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement