
ఐదుగురు మృతి, 16 మంది గల్లంతు
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లో సోమవారం రాత్రి నుంచి కుండపోతగా కురుస్తున్న వాన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఆకస్మికంగా సంభవించిన వరదల్లో ఐదుగురు చనిపోగా, మరో ఐదుగురు గాయాల పాలయ్యారు. మరో 16 మంది గల్లంతయ్యారు.
24 గంటల వ్యవధిలో రాష్ట్రవ్యాప్తంగా 225.38 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పదకొండు చోట్ల కుండపోత వాన, నాలుగు చోట్ల ఆకస్మిక వరదలు సంభవించగా, ఒక చోట భారీగా కొండచరియలు విరిగిపడ్డాయని అధికారులు తెలిపారు.