
దొడ్డబళ్లాపురం(బెంగళూరు): అభివృద్ధి పనుల్లో జాప్యం జరుగుతుండడంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే ఇంజినీర్‌ను బురదలో దింపి పనిష్మెంట్ ఇచ్చిన సంఘటన నెలమంగలలో చోటుచేసుకుంది. దొడ్డబళ్లాపురం–నెలమంగల ప్రధాన రహదారి మార్గంలో గొల్లహళ్లి వద్ద రైల్వే పైవంతెన పనులు గత రెండు సంవత్సరాలుగా కుంటుతూ సాగుతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఇందుకు సంబంధించి స్థానికులు ఎమ్మెల్యే శ్రీనివాస్ వద్ద ఫిర్యాదు చేయడంతో ఘటనాస్థలానికి వచ్చిన ఎమ్మెల్యే ఇంజినీర్‌ను పిలిచి దుర్భాషలాడి ఒకసారి బురదలో దిగి పరిశీలించాలని ఆదేశించాడు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ఇంజినీర్ బురదలో దిగి నడిచాడు. పనులు త్వగా పూర్తిచేయాలని లేదంటే ఇదే బురద ముఖానికి పూస్తానని గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఈ సంఘటనకు సంబంధించి పలువురు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంటే మరికొందరు అధికారులు ఇలా చేస్తే కనీసం పనులు త్వరగా చేస్తారని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
చదవండి తల్లీకొడుకులను కలిపిన భారీ వరదలు.. 35 ఏళ్ల క్రితం వేరయి..