Karnataka Minister Eshwarappa Celebrated Monkey Birthday - Sakshi
Sakshi News home page

మంత్రి.. మర్కట ప్రేమ.. కొత్తబట్టలు తొడిగి.. కేక్‌ ‍కట్‌ చేయించి

Dec 8 2021 7:47 AM | Updated on Dec 8 2021 9:12 AM

Minister Eshwarappa Attended Monkeys Birthday Celebrations In Karnataka - Sakshi

మర్కటానికి ప్రేమగా కేక్‌ తినిపిస్తున్న కర్ణాటక మంత్రి కేఎస్‌ ఈశ్వరప్ప

సాక్షి, శివమొగ్గ (కర్ణాటక): ఇళ్లల్లో పెంపుడు జంతువులకు పుట్టినరోజు, బారసాల, సీమంతాలు జరపడం నేటి రోజుల్లో ఒక ట్రెండ్‌గా మారింది. ఆ కార్యక్రమాలను ఎంతో ఘనంగా నిర్వహించాలని యజమానులు కూడా తపిస్తుంటారు. ఇదే కోవలో ఒక కోతికి పుట్టినరోజు నిర్వహించగా, ఒక సీనియర్‌ మంత్రి హాజరై దానిని ఆశీర్వదించారు. ఈ తతంగం కర్ణాటకలోని శివమొగ్గ నగరంలో చోటుచేసుకుంది.

వివరాలు.. ఎన్‌.టి.రోడ్డులో నివాసం ఉండే పార్వతమ్మ అనే మహిళ ఆరేళ్ల నుంచి ఒక వానరాన్ని పెంచుకుంటోంది. సోమవారం సాయంత్రం కోతి పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీజేపీ సీనియర్‌ నేత, కర్ణాటక రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కె.ఎస్‌.ఈశ్వరప్ప, మరో స్వామీజీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కోతికి కొత్తబట్టలు తొడిగి, దానితోనే కేక్‌ కట్‌ చేయించి, తినిపించి ముచ్చట పడ్డారు.

రాజకీయ వ్యూహాలతో సొంత, ప్రతిపక్ష పార్టీల నేతలను ముప్పతిప్పలు పెట్టే మంత్రి ఈశ్వరప్పలో ఇంత జంతు ప్రేమ ఉందా అని అందరూ ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో అలరిస్తోంది.   

Advertisement
 
Advertisement
Advertisement