Mehul Choksi: చోక్సీకి బెయిల్‌

Mehul Choksi granted interim bail on medical grounds by Dominica Court - Sakshi

న్యూఢిల్లీ: అక్రమంగా దేశంలోకి ప్రవేశించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న మెహుల్‌ చోక్సీకి డొమెనికా హైకోర్టు సుమారు రూ.2.75 లక్షల పూచీకత్తుతో బెయిల్‌ మంజూరు చేసింది. వైద్య చికిత్స కోసం ఆంటిగ్వా బార్బుడాకు చోక్సీ వెళ్లేందుకు కోర్టు అనుమతినిచ్చిందని స్థానిక మీడియా తెలిపింది. దీంతో చోక్సీని ఇండియాకు తీసుకురావాలన్న యత్నాలకు విఘాతం కలిగినట్లయింది.

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు కుంభకోణం కేసులో నిందితుడైన చోక్సీ 2018 నుంచి ఆంటిగ్వాలో తలదాచుకున్నాడు. ఇటీవలే ఆయన్ను కొందరు అపహరించి డొమెనికాకు తీసుకుపోవడం కలకలం సృష్టించింది.  చోక్సీ అక్రమ చొరబాటుపై మెజిస్ట్రేట్‌ కోర్టు ముందు జరిగే విచారణపై కూడా స్టే మంజూరు చేసింది. చికిత్స అనంతరం చోక్సీ విచారణకు హాజరుకావాల్సిందేనని, ఈ విషయంలో బెయిల్‌ కుదరదని తెలిపింది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top