ఘోర అగ్నిప్రమాదం..పలువురికి తీవ్ర గాయాలు

Massive Fire After Explosion In Nashik Factor Several Workers Trapped - Sakshi

నాసిక్‌ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో పలవురు కార్మికులు అగ్ని ప్రమాదంలో చిక్కుకుపోయారు. ఈ మేరకు మహారాష్ట్రలో నాసిక్‌లోని ముండేగావ్‌ గ్రామంలోని ఫ్యాక్టరీలో ఆదివారం ఉదయం 11 గంటలకు భారీ బాయిలర్‌ పేలుడు జరిగిందని అధికారులు తెలిపారు. దీంతో పెద్ద ఎత్తున్న మంటలు చెలరేగాయని చెప్పారు. ఘటనస్థలికి చేరుకున్న అగ్నిమాపక దళాలు మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.

ఇప్పటి వరకు సుమారు 11 మంది కార్మికులను రక్షించారు. మరికొందరు మంటల్లో చిక్కుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఐతే ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. 

(చదవండి: న్యూయర్‌ వేడుకల్లో రగడ..సెల్ఫీల కోసం వేరేవాళ్ల భార్యలతో బలవంతంగా..)

మరిన్ని వార్తలు :

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top