UP Man Wants To Invite Modi And Yogi Adityanath His Wedding - Sakshi
Sakshi News home page

ఎట్టకేలకు డ్రీమ్‌ గర్ల్‌తో వివాహం...మోదీ, యోగీలకు ఆహ్వానం!

Oct 30 2022 3:09 PM | Updated on Oct 30 2022 3:39 PM

UP Man Wants To Invite Modi And Yogi Aditynath His Wedding - Sakshi

ఎట్టకేలకు వివాహం కుదిరింది. అందుకే...

అత్యంత పొట్టి వ్యక్తి తన వివాహం కోసం ఎన్నెళ్లగానో ఎదురుచూశాడు. పెళ్లి కుదరడమే కష్టమైంది. ఎందుకంటే ఆ వ్యక్తి పొడుగు కేవలం 2.3 పొడుగులు. దీంతో తనకు తగిన అమ్మాయికి కోసం వెదకడం చాలా కష్టమైంది. ఒకనొక దశలో ఈవిషయమై రాజకీయ నాయకులను సైతం కలిసాడు సదరు వ్యక్తి. అతనే యూపికి చెందిన అజీమ్‌ మన్సూరీ. చాలా ఏళ్ల నిరీక్షణ తర్వాత కుదరక.. కుదరక వివాహం కుదరడంతో పట్టరాని ఆనందంలో ఉన్నాడు అజీమ్‌.

తన వివాహం విషయమై పలువురు ప్రముఖులను, రాజకీయనాయకులను కలిసి తన గోడు వెళ్లబోసుకున్నాడు. అంతేకాదు తన వివాహం కోసం 2019లో యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌ను సైతం సంప్రదించాడు. చివరకు ఎట్టకేలకు అజీమ్‌ తన డ్రీమ్‌ గర్ల్‌ బుషారాని మార్చి 2021లో కలుసుకున్నాడు. హాపూర​ చెందిన ఆమె ఎత్తు మూడు అడుగుల . ఏప్రిల్‌ 2021లో ఆమెతో నిశ్చితార్థం చేసుకున్నాడు అజీమ్‌.

ఐతే ఆమె గ్రాడ్యుయేషన్‌ పూర్తి అయిన తర్వాత ఇరువురు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. వచ్చే నెల నవంబర్‌ 7న వారి విహహం. కానీ అజీమ్‌ మాత్రం ఐదోతరగతి డ్రాపవుట్‌. చిన్నప్పటి నుంచి ఎన్నో చీత్కారాలు ఎదుర్కొన్నాడు. ఆఖరికి తనకు తగిన పెళ్లికూతురు దొరకడం కూడా కష్టమైంది. ఎట్టకేలకు అనుకున్నది సాధించాడు. అందుకే తన పెళ్లికి ప్రధాని నరేంద్ర మోదీని, ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ని ఢిల్లీ వెళ్లి మరీ ఆహ్వనిస్తానని ఆనందంగా చెబుతున్నాడు. 

(చదవండి: కంగనా రనౌత్‌ పొలిటికల్‌ ఎంట్రీపై నడ్డా కీలక వ్యాఖ్యలు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement