తప్పించుకునే ప్రయత్నంలో దూకేశాడు..అంతే చివరికి!!

Man Involved In Drugs Offence Trying To Escape Police By Climbing Down An Apartment Building - Sakshi

ముంబై: పోలీసుల నంచి తప్పించుకునే ప్రయత్నంలో ఆత్మహత్యలకు పాల్పడటం లేదా భవనాల మీద నుంచి దూకడం వంటివి చేస్తుంటారు. అంతేకాదు మరికొంతమంది పోలీసులపైనే దాడి చేసే ప్రయత్నం కూడా చేస్తుంటారు. కానీ ఇక్కోడొక ముంబై​ వాసి పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో తన ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు.

(చదవండి: ప్రపంచంలోనే అత్యంత ప్రీమెచ్యూర్‌ బేబిగా గిన్నిస్‌ రికార్డ్‌)

అసలు విషయంలోకెళ్లితే.. మాదక ద్రవ్యాలకు సంబంధించిన నేరానికి పాల్పడిన వ్యక్తి మహారాష్ట్రలోని ముంబైలోని ఒక భవనంపై నుండి పడి మరణించాడు. అయితే ఆ వ్యక్తి ఢిల్లీ పోలీసుల బృందం నుంచి తప్పించుకునే ప్రయత్నంలోనే ఈ ఘటన జరిగిందని పోలీసులు చెబుతున్నారు.  అంతేకాదు మృతుడు ముంబైలోని మలాడ్‌లోని ఎవర్‌షైన్ నగర్ నివాసి డేవి రాయ్‌గా గుర్తించారు. అయితే అతనిపై  2017లో ఢిల్లీలో డ్రగ్స్ కేసు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు.

ఈ మేరకు ఢిల్లీ పోలీసు బృందం స్థానిక పోలీసులను సంప్రదించి రాయ్‌ను పట్టుకోవడానికి ముమ్మరంగా గాలించే చర్యలు చేపట్టారు. అయితే ఈ బృందం రాయ్ రెసిడెన్షియల్ సొసైటీకి చేరుకుని అక్కడి సొసైటీ వాచ్‌మెన్‌తో కలిసి రాయ్ అపార్ట్‌మెంట్‌కు వెళ్లి తలుపు తట్టిన ఎటువంటి  సమాధానం లేకుండా పోయింది. పైగా  నిందుతుడు రాయ్‌ ఆసుపత్రిలో తాను చనిపోయినట్లుగా టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికలో తప్పుడు రిపోర్ట్‌ని కూడా ఇచ్చాడని  పోలీసులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు రాయ్‌ తమ నుంచి తప్పించుకునే  క్రమంలోనే భవనంపై నుంచి కిందకు దిగేందుకు ప్రయత్నిస్తూ ప్రమదవశాత్తు కిందపడి మృతి చెందాడని చెప్పారు. 

(చదవండి: ఒకప్పుడు అది నరకం..ఇప్పుడు నందనవనం!)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top