Premature Baby In The World: ప్రపంచంలోనే అత్యంత ప్రీమెచ్యూర్‌ బేబిగా గిన్నిస్‌ రికార్డ్‌

A Baby BoY Is Decaled As The World Most Prematur Baby By Gunnies World Records  - Sakshi

న్యూయార్క్‌: నిజానికి నెలలు నిండకుండా పుట్టే పిల్లలు బ్రతికి ఉండడం అత్యంత అరుదు. ఒకవేళ బతికినా జీవితాంతం ఏవో అనారోగ్య సమస్యలతో సతమతమవుతుంటారు. కానీ ఇప్పటి వరకు నెలలు తక్కువగా పుట్టడం అంటే మహా అయితే డెలివరీ తేదికి కాస్త ఒక నెల ముందుగా లేదా ఒక నెల రెండు వారాలు అటు ఇటుగా పట్టడం జరుగుతుంది. కానీ అలా ఇలా కాకుండా కేవలం 21 వారాలు 1 రోజుతో జన్మించి ఆరోగ్యంగా బ్రతికి బట్టగలిగాడు యూఎస్‌కి చెందిన కర్టిస్‌ అనే చిన్నారి.

(చదవండి: ఇదో కొత్తరకం కేఫ్... ఇంత వరకు ఎవ్వరూ చూసుండరు!)

అసలు విషయంలోకెళ్లితే...యూఎస్‌లోని అలబామాకు చెందిన కర్టిస్ జై-కీత్ మీన్స్ అనే చిన్నారి జూలై 2020లో 21 వారాలు  1 రోజుతో జన్మించి ప్రపంచలోని అత్యంత నెలలు నిండని శిశువుగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లో స్థానం దక్కించుకున్నాడు. ఆ చిన్నారి తల్లి మిచెల్‌ చెల్లీ బట్లర్‌కి మొదట గర్భం బాగానే ఉంది. అయితే ఒకరోజు అనుకోకుండా ఆమె ఆరోగ్యంలో చిన​ సమస్య తలెత్తడంతో అత్యవసర శస్త్రచికిత్స నిమిత్తం  గతేడాది జూలై 4న ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆమెను స్థానిక ఆసుపత్రి నుండి బర్మింగ్‌హామ్ (యూఏబీ)లోని అలబామా విశ్వవిద్యాలయానికి మార్చారు. ఆ సమయంలో ఆమెకు అబార్షన్‌  చేయాలని నిర్ణయించారు. అయితే ఆమె పట్టబట్టడంతో డెలివీరీ తేదికి 19 వారాలు ముందుగా అంటే 21 వారాల 1 రోజు (148 రోజులు) గర్భధారణతో జూలై 5న మధ్యాహ్నాం 1 గంటకు కర్టిస్‌ జన్మించాడు.

అయితే వైద్య సిబ్బంది ఆ వయసు పిల్లలు బతకడం కష్టం అని తేల్చి చెప్పేశారు. కానీ ఆశ్చర్యంగా కర్టిస్‌ చికత్సకు స్పందించడం మొదలుపెట్టాడు. అయినప్పటికీ వైద్యులు ఇలా బతకట కష్టం ఈ విధంగా చికిత్స అందించటం చాలా ఒ‍త్తిడితో కూడిని పని అని చెప్పారు. ఈ మేరకు  యూఏబీ హాస్పిటల్‌లోని పీడియాట్రిక్స్ ప్రొఫెసర్ డాక్టర్ బ్రియాన్ సిమ్స్ మాట్లాడుతూ, "ఈ వయస్సులో ఉన్న పిల్లలు బతకలేరనే చాలా కేసులు చెబుతున్నాయి. కానీ ఈ తల్లి ఆశ నెరవేరుతుందో లేదో అనుకున్నాను. పైగా ఇంత నెలల తక్కువ బిడ్డను నియోనాటల్ ఇంటెన్సివ్‌ కేర్‌కి తరలించడం కష్టమని గ్రహించాం. దీంతో  ఆ బిడ్డ ఉన్న ప్రదేశం నుంచే చికిత్స అందించాం. అయితే ఆ చిన్నారి ఆక్సిజన్‌కి స్పందించడం హృదయస్పందన రేటు పెరగడం జరిగింది. అంతేకాతు ఆ చిన్నారికి మూడు నెలల వయసు వచ్చే వరకు వెంటిలేటర్‌ మీద చికిత్స అందించాం" అని అన్నారు.

ఆ తర్వాత ప్రాంతీయ నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఆర్‌ఎన్‌ఐసీయూ)లో 275 రోజులు గడిపిన తదనంతర చిన్నారి కర్టిస్ ఈ ఏడాది ఏప్రిల్ 6న ఇంటికి వెళ్లేందుకు అనుమతించారు.  ఈ మేరకు నియోనాటాలజీ విభాగంలోని అసిస్టెంట్ ప్రొఫెసర్ అయిన డాక్టర్ కోల్మ్ ట్రావర్స్ చిన్నారి కర్టిస్  21 వారాల 1-రోజు గర్భధారణ వయస్సులో జన్మించివాడిగా ప్రపంచ రికార్డును నెలకొల్పి ఉండవచ్చన్న అనుమానంతో చిన్నారి తల్లి మిచెల్‌తో గిన్నిస్‌ రికార్డుకి దరఖాస్తు చేయించారు.  అంతేకాదు గిన్నిస్‌ రికార్డు కూడా ప్రపంచంలోనే అత్యంత నెలలు నిండకుండా జన్మించిన అరుదైన చిన్నారిగా ప్రకటించటం విశేషం.

(చదవండి: ఐస్‌క్రీం కొనడానికి వచ్చి ఏం చేశాడో తెలుసా... నవ్వాగదు!

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top