అమానుషం: వీధి శునకాన్ని రాడ్డుతో కొట్టి చంపాడు..

Man Brutally Attack On Street Dog In karnataka - Sakshi

సాక్షి, బొమ్మనహళ్లి(కర్ణాటక): మూగజీవి అనే జాలి లేకుండా ఓ వ్యక్తి వీధి శునకాన్ని ఇనుపరాడ్డుతో కొట్టి చంపివేశాడు. ఈ అమానుష ఘటన బెంగళూరు సమీపంలోని ఆనేకల్‌ తాలూకా హెబ్బగోడిలో చోటు చేసుకుంది. హెబ్బగోడిలోని మడివాళ ప్రాంతంలో నివాసం ఉంటున్న వ్యక్తి తన పెంపుడు కుక్కను బుధవారం సాయంత్రం వాయువిహారం కోసం తీసుకెళ్లాడు. అ సమయంలో వీధి శునకం పెంపుడు కుక్కపై దాడి చేసింది.

మద్యం మత్తులో ఉన్న ఆ వ్యక్తి  ఇనుపరాడ్డు తీసుకోని వీధికుక్కతలపై బాదడంతో అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం దానిని లాక్కుంటూ వచ్చి మెయిన్‌ రోడ్డులో పడేశాడు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. ఇది హేయమైన చర్యగా జంతు ప్రేమికులు అభివర్ణించారు. కుక్కను చంపిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని యలహంకకు చెందిన ప్రాణిదయామయ సంఘానికి చెందిన అనిరుద్‌ హెబ్బగోడి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

చదవండి: మాస్క్‌ లేకుంటే డెల్టా ప్లస్‌ డేంజరే.. పక్కన ఉన్నా పాజిటివ్‌! 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top