కాంగ్రెస్‌కు మద్దతిస్తా కానీ..: మమతా బెనర్జీ

Mamata Banerjee On Opposition Unity Will Support The Congress - Sakshi

ఎన్నికల పోరులో ప్రతిపక్షాల ఐక్యత విషయమై పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ నేత మమతా బెనర్జీ తొలిసారిగా తన వైఖరి ఏంటో ముందుగానే స్పష్టం చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ బలంగా ఉన్న చోట తమ పార్టీ మద్దతు ఇస్తుందని తేల్చి చెప్పారు. కాంగ్రెస్‌ బలంగా ఉన్న చోట పోరాడనివ్వండి అని అన్నారు. అందుకు తమ మద్దతు ఇక్కడ ఇస్తామని చెప్పారు.

కానీ అదేసమయంలో వారు కూడా ఇతర పార్టీలకు కూడా మద్దతు ఇవ్వాలన్నారు. కాంగ్రెస్‌ మద్దతు పొందాలంటే మొదటగా అది కూడా ఇతర పార్టీలకు మద్దతివ్వాల్సి ఉంటుందని నొక్కి చెప్పారు. ఈ సందర్భంగా ఆమె బలమైన ప్రాంతీయ పార్టీలకు తప్పక ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. ఈమేరకు ఆమె బీజేపీని ఓడించేలా కొత్త వ్యూహ  రచనను కూడా తెరపైకి తీసుకొచ్చారు. ప్రాంతీయ పార్టీలు అన్ని తమ కంచుకోటలో బీజేపీని ఎదుర్కోవాలి, కాంగ్రెస్‌ మాత్రం తన సొంత సీట్లను గెలవడంపై దృష్టి సారించాలన్నారు.

ఆ తర్వాత విపక్షాలన్ని కలసి బలమైన పార్టీకే ప్రాధాన్యత(ఏ పార్టీ ఎక్కువ సీట్లు దక్కించుకుందో) ఇవ్వాలని అన్నారు. అలాగే ప్రాంతీయ పార్టీలకు కూడా కాంగ్రెస్‌ మద్దతివ్వాలని చెప్పారు. కేవలం తనకు కావల్సిన మద్దుతు తీసుకుని రోజు మాపైనే పోరాడుతూ ఉండటం అనేది సరైన పాలసీ కాదని చెప్పారు. కాగా, సీటు షేరింగ్‌ ఫార్ములా బలంగా ఉ‍న్న ప్రాంతాల్లోని ఆటగాళ్లకే ప్రాధాన్యత ఇస్తామని తృణమూల్‌ నాయకురాలు మమతా కూడా చెప్పకనే చెప్పారు. అంతేగాదు ఆమె కర్ణాటకలో కాంగ్రెస్‌కి పట్టం కట్టిన ప్రజలకు సెల్యూట్‌ చేశారు కూడా. 

(చదవండి: ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేసి ఉత్తర్వును ఉల్లంఘించడంతో..ఐఏఎస్‌ అధికారికి నోటీసులు)
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top