సరిహద్దుల్లో టెన్షన్‌..టెన్షన్

Major Force Buildup Of Chinese Tanks In The South Pangong Region Of Eastern Ladakh - Sakshi

డ్రాగన్‌కు దీటుగా బదులిచ్చేందుకు భారత్‌ సన్నద్ధం

ఎల్‌ఏసీ వెంబడి యుద్ధ ట్యాంకులు, దళాల మోహరింపు

సాక్షి, న్యూఢిల్లీ : తూర్పు లడఖ్‌లోని దక్షిణ పాంగాంగ్ ప్రాంతంలో చైనా ట్యాంకులు ,పదాతిదళాలు మోహరించాయి. ఆగస్ట్‌ 30న ఈ ప్రాంతంలోకి చొచ్చుకువచ్చిన చైనా దళాలను భారత సైన్యం దీటుగా తిప్పికొట్టిన అనంతరం చైనా మరోసారి దూకుడు ప్రదర్శిస్తోంది. ఎల్‌ఏసీకి 20 కిలోమీటర్ల దూరంలో డ్రాగన్‌ సైన్యం అత్యాధునిక గన్స్‌, యుద్ధపరికరాలతో సన్నద్ధమైంది. దక్షిణ పాంగాంగ్‌లోని మోల్ధో వద్ద చైనా స్ధావరాలకు చేరువలోనే చైనా ట్యాంకులు పదాతిదళాల కదలికలను పసిగట్టినట్టు ఓ జాతీయ న్యూస్‌ ఛానెల్‌ పేర్కొంది. చైనా భారీ ఆయుధాల కదలికను భారత సైన్యం పసిగడుతూనే ఉందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. కుంగ్ నుండి ముక్పారికి వెలుపల చైనా సైన్యం మోహరించింది.  ఇందులో కీలకమైన స్పాంగూర్ గ్యాప్ యొక్క రెండు భుజాల నియంత్రణ ఉంటుంది, ఇది అధిక ఎత్తులో ఉన్న పాస్ రెండు కిలోమీటర్ల కంటే ఎక్కువ వెడల్పుతో ట్యాంకులు పనిచేయగలవు.

మరోవైపు భారత సైన్యం యుద్ధ ట్యాంకులతో అదనపు దళాలతో ఈ ప్రాంతంలో వివాదాస్పద ఎల్‌ఏసీ ప్రాంతం వెంబడి మోహరించింది. చైనా సాయుధ దళాలను ట్యాంక్‌ విధ్వంస క్షిపణులు, రాకెట్లు, ఇతర ఆయుధాలతో తిప్పికొట్టేలా భారత్‌ ఈ ప్రాంతంలో సర్వసన్నద్ధమైంది. తూర్పు లడఖ్‌లోని పర్వత ప్రాంతాల్లో భారత్‌ క్షిపణి సహిత టీ-90 యుద్ధ ట్యాంకులు, టీ-72ఎం1 ట్యాంకులను సిద్ధం చేసింది. మరోవైపు ఇరు పక్షాల వైమానిక దళాలు సైతం ఎల్‌ఏసీపై పహారా కాస్తున్నాయి. ఎల్‌ఏసీ వెంబడి పరిస్థితి కొంతమేర ఉద్రిక్తంగా ఉందని ఆర్మీ చీఫ్‌ జనరల్‌ మనోజ్‌ ముకుంద్‌ నరవణే శుక్రవారం  పేర్కొన్నారు. మన భద్రత కోసం ముందస్తుగా దళాల మోహరింపును చేపట్టామని చెప్పారు. చదవండి : దుస్సాహసానికి దిగితే తీవ్ర నష్టం: రావత్‌

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top