
సుమారు రూ. 30 లక్షల రివార్డు ఉన్న ముగ్గురు దళ సభ్యులను సిబ్బంది..
భోపాల్: మధ్యప్రదేశ్–ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో సోమవారం పోలీసులతో ఎదురుకాల్పుల్లో ముగ్గురు నక్సల్స్ మరణించారు. మృతుల్లో డివిజనల్ కమిటీ సభ్యుడు నగేశ్ ఉన్నాడు. డివిజనల్ కమిటీ సభ్యుడు, కమాండర్ ఇన్ చీఫ్ స్థాయి నక్సల్ నేత మధ్యప్రదేశ్‌లో ఎన్‌కౌంటర్‌లో మరణించడం ఇదే తొలిసారి.
మృతులపై మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా రూ.57 లక్షల రివార్డు ప్రకటించాయి. నగేష్ మీద 15 లక్షల దాకా రివార్డు ఉంది. ఈ ఎన్‌కౌంటర్ పట్ల హర్షం వ్యక్తం చేసిన హోం మంత్రి.. ఆపరేషన్‌లో పాల్గొన్న హాక్ ఫోర్స్‌తో పాటు ఇతర సిబ్బందిని అభినందిస్తూ.. ప్రోత్సహాకాలు ప్రకటించారు.