లండన్‌ ఘటనకు భారత్‌ కౌంటర్‌.. బారికేడ్ల తొలగింపు

London Incident India Counter Remove Barricades Outside UK HC - Sakshi

ఢిల్లీ: లండన్‌లోని భారత హైకమిషన్‌ వద్ద ఖలీస్తానీ మద్దతుదారుల దుశ్చర్యకుగానూ.. భారత్‌ కౌంటర్‌ ఇచ్చింది. ఢిల్లీలోని యూకే హైకమిషన్‌ బయట ఉన్న బారికేడ్లను బుధవారం తొలగించింది. తద్వారా యూకే తీరుకు గట్టి బదులు ఇచ్చింది. 

ఖలీస్తానీ-పాక్‌ ఏజెంట్‌ అమృత్‌పాల్‌ సింగ్‌కు మద్దతుగా.. ఖలీస్తానీ గ్రూప్‌నకు చెందిన కొందరు లండన్‌లోని భారత హై కమిషన్‌ వద్ద మువన్నెల జెండాను కిందకి దించేసి.. ఖలీస్తానీ జెండా ఎగరేసే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో భారత హైకమిషన్‌ అధికారులు తక్షణం స్పందించడంతో ఆ ప్రయత్నం భగ్నమైంది.  అయితే.. ఇంత జరుగుతున్నా అక్కడి పోలీసులు, అధికారులు స్పందించలేదు. 

సకాలంలో స్పందించకపోవడం మాట అటుంచి.. భారత హైకమిషన్‌కు తగినంత భద్రత కల్పించకపోవడాన్ని భారత్‌ తీవ్రంగా తప్పుబట్టింది. ఈ  క్రమంలోనే ఢిల్లీలోని కార్యాలయం ఎదుట బారికేడ్లను తొలగించింది. ఇదిలా ఉంటే.. ఈ పరిణామంపై ఇప్పటికే ఆ దేశ రాయబారిని వివరణ కోరుతూ భారత విదేశాంగ శాఖ నోటీసులు జారీ చేసింది కూడా. ఇక అక్కడి అధికార యంత్రాంగం, మంత్రులు మాత్రం.. ఖలీస్తానీ మద్దతుదారుల చర్యలను హేయనీయమైన చర్యగా పేర్కొన్నాయి. 

ఇదీ చదవండి: ఝండా ఊంచా రహే హమారా

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top